Monday, December 23, 2024

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

కారేపల్లి: ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను మండలంలోని ఉత్సాహవంతులై న నిరుద్యోగ యువతీ యువకు లు సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఐ పుష్పాల రామారావు సూ చించారు. కారేపల్లి పోలీస్ స్టేషన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ పలు ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీ రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈనెల 21వ తేదీన నగరంలోని ఎస్బిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. వంద వరకు ప్రైవేట్, కార్పొరేట కంపెనీలు రానున్న

ఈ జాబ్ మేళా ద్వారా సుమారు నాలుగు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్హులైన యువతీ యువకులు వారి పూర్తి వివరాలు స్ధానిక పోలీస్ స్టేషన్‌లలో ఈనెల 18వ తేదీలోపు స్వయంగా సమర్పించాలన్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు కూడా పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో వుంటాయని,అనేక కంపెనీలు వస్తున్నందున కనీసం 10 రె జ్యూమ్ ఫైల్స్ తయారు చేసుకొని రావాలని అభ్యర్ధులకు సూచించారు. జాబ్ మేళా అనంతరం ఉద్యోగాల నియామక వివరాలు తెలియజేయపడతాయని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News