ఖమ్మంలో బిఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభకు సిఎం కెసిఆర్, ముఖ్య అతిధులుగా మూడు రాష్ర్టాల సిఎంలు కేజ్రివాల్, విజయన్, భగవంత్ సింగ్ ,యూపి మాజీ సిఎం అఖిలేష్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో కేరళ సిఎం విజయన్ మాట్లాడుతూ తెలంగాణ పథకాలు, కార్యక్రమాలు ప్రశంసీనయమని సిఎం విజయన్ కొనియాడారు. తెలంగాణ పథకాలను కేరళలో కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
రాజ్యాంగాన్ని కాపాడేందుకు కెసిఆర్ పోరాడుతున్నారని కెసిఆర్ పోరాటానికి తమ మధ్ధతు ఉంటుందని విజయన్ పేర్కొన్నారు. ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా మోది పాలన జరుగుతుందని అన్నారు. ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి అవుతుందని కేరళ సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. బిజెపి సర్కార్ వైఖరితో రాజ్యాంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని , రాష్ర్టాల హక్కులను కాలరాస్తోందని , కార్పోరేట్ శక్తులకే మోదీ సర్కార్ ఊతం ఇస్తోందని విజయన్ తెలిపారు. రాజ్ భవన్ లు బిజెపి కార్యాలయాలుగా మారిపోయాయని, హిందీని బలవంతంగా రాష్ర్టాలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.