Monday, December 23, 2024

దేశంలో ప్రబలమైన మార్పుకు ఖమ్మం సభ సంకేతం : సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

దేశంలో ప్రబలమైన మార్పుకు ఖమ్మం సభ సంకేతమని సిఎం కెసిఆర్ అన్నారు. బుధవారం నిర్వహించి ఖమ్మం బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ మంత్రి తుమ్మల అజయ్ హయాంలో ఖమ్మం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని ,ఖమ్మంలో మరింత అభివృద్ధి జరగడానికి 50 కోట్లు ఖమ్మం మున్సిపాలిటికి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మన్నేరు పై కొత్త బ్రిడ్జిని నిర్మిస్తామని సిఎం హామీ ఇచ్చారు. అదే విధంగా ఇతర మున్సిపాల్టీలకు 30 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. 589 గ్రామ పంచాయతీలకు 10 లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు సిఎం ప్రకటించారు.

అదే విధంగా ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయాలని మంత్రి, నాయకులు కోరుతున్నారని త్వరలోనే జెఎన్ టియు ద్వారా ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయిస్తామని అన్నారు. ఖమ్మంలో హెడ్ క్వార్టర్ లో ఎంత మంది జర్నలిస్టులు ఉన్నారో వారందరికి ఇండ్ల స్థలం నెల రోజుల్లో మంజూరు చేస్తామని సూచించారు. జర్నలిస్టులతో పాటు ఫోటోజర్నలిస్టులకు కూడా మంజూరు చేయాలని వారిని చిన్న చూపు చూడొద్దని కోరారు. ఒకటే ఒక మాట తనను అనేక రోజులుగా కలిచివేస్తుందని దేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా దారి తప్పి బిత్తర పోయి గత్తర పోతుందా నా అంతరాత్మను ఈ ప్రశ్నలు కలిచివేస్తున్నాయని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ ప్రపంచ బ్యాంకును అప్పు అడగకుండా ఏ అమెరికా కాళ్ళను మొక్కకుండా బతికేంత వనరులు మనకున్నాయని, సందప ఉండి కూడా యాచకులు ఎందుకు కావాలని ప్రశ్నించారు. లక్షా 40 వేల టిఎంసీల్లో 70 వేల టిఎంసిలు నీళ్ళు మనుకుంటాయి, భూమి ఉంది, నీరు ఉంది, సూర్య కాంతి కూడా ఉంది, మనక యాపిల్ పండుతుంది, మామిడి కాయలు పండుతాయ్, కష్టించి పనిచేసే జాతిరత్నాలు దేశంలో ఉన్నాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఇంత సంపద, వనరులు ఉన్న దేశంలో రైతులు రాజధానిలో నెలలు తరబడి పోరాడుతున్నారని, దేశానికి కావాల్సింది ఇదేనా అని అన్నారు.

దేశమంతా రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి తీరాలని తెలిపారు. కేంద్రంలో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతటా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. రైతుబంధు దేశమంతటా అమలు చేయాలన్నదే బిఆర్ఎస్ నినాదం అని సిఎం తెలిపారు. మోదీని మాట్లాడమంటే రేకు డబ్బాలో రాళ్ళేసినట్టే లొడ లొడా వాగుతుంటారని మనం డబ్బా రేకుల లొడ లొడ విందామా మనం ఎందుకు మోసపోవాలని , మోదిది పాలసీ ప్రైవేటైజేషన్.. బిఆర్ఎస్ ది పాలసీ నేషనలైజేషన్ అని అన్నారు. విశాఖ ఉక్కును మళ్ళి ప్రభుత్వంలోకి తెస్తామని వాగ్దానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News