Monday, December 23, 2024

అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. అక్టోబర్ 31న అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో పుచ్చా వరుణ్ రాజ్ అనే ఒక 24 సంవత్సరాల తెలంగాణ విద్యార్థి కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. వల్పారైసో నగరంలోని జిమ్‌లో ఆండ్రాడ్(24) అనే వ్యక్తి వరుణ్‌ను కత్తితో పొడిచాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, వరుణ్ చికిత్స కోసం ఫోర్ట్ వేనె ఆసుపత్రికి తరలించారు.

అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుణ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వరుణ్ కుటంబంలో విషాదం నెలకొంది. వాల్పరైసో యూనివర్సిటీలో ఎంఎస్ చదువేందుకు అమెరికా వెల్లిన వరుణ్ రాజ్.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News