Thursday, January 2, 2025

అమెరికాలో కాల్పులు… ఖమ్మం విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో కాల్పుల కలకలం సృష్టించాయి. చికాగోలో దుండగుల కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి సాయితేజ మృతి చెందాడు. భారత కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి ఒంటిగంటకు షాపింగ్ మాల్స్ లో స్టోర్ మేనేజర్ గా పనిచేస్తున్న సాయి తేజపై ఇద్దరూ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపి క్యాష్ కౌంటర్ లోని నగదుతో పారిపోయారు. ఖమ్మం గ్రామీణం రామన్నపేటలోని రమణగుట్ట ప్రాంతానికి చెందిన నూకరపు సాయి తేజ(26)గా గుర్తించారు. నూకారపు కోటేశ్వరరావు కుమారుడు సాయి తేజ ఎంఎస్ చదవడానికి నాలుగు నెలల క్రితమే అమెరికా వెళ్లారు. రామన్నపేటలో విషాదచాయలు అలుముకున్నాయి. సాయతేజ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. శుక్రవారం, శనివారం వరకు అతని భౌతిక కాయం ఖమ్మం నగరానికి తీసుకురావడానికి తానా ప్రతినిధులు కృషి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News