Tuesday, September 17, 2024

మున్నేరు ముంచింది.. కన్నీరే మిగిలింది

- Advertisement -
- Advertisement -

 ఆకస్మిక వరదకు నిండా మునిగిన ఖమ్మం నగరం
 13 కాలనీల్లో 5వేల ఇళ్ళలో బురద మేటలు 
 వరద ధాటికి ధ్వంసమైన వేలాది ఇళ్ళు
 కోట్లాది విలువైన వస్తువుల విధ్వంసం

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఖమ్మం నడిబొడ్డున సునామి వచ్చిందా లేక గోదావరి ప్రళయం వచ్చిందా అని ఆశ్చర్యపడే విధంగా వచ్చిన మున్నేరు వరదల విశ్వరూపానికి పరివాహక ప్రాంత ప్రజలు విలవిలలాడారు.తుఫాన్ అనంతర ప్రశాంతలాగా ఇప్పుడు వరదగాయాలు బయటపడుతున్నాయి. వందేళ్ళ చరిత్రలో కనివిని ఎరగని విధం గా మూడు రోజుల క్రితం మున్నేరు స్రష్టించిన జలప్రళయంలో ఖమ్మం నగరం చిగురుటాకులా వణికిపోయింది పగటి పూట వరదలు రావడంతో ప్రాణాలతోనైన బయట పడ్డారు.

అదే గాఢ నిద్రలో ఆర్ధరాత్రి ఇదే విదంగా వరదలు వస్తే? పరిస్థితిని ఉ హించుకుంటనే ఒళ్ళు జలదరించిపోతుంది. వరంగల్ జిల్లా నుంచి పారే మున్నేరు నది చరిత్రలో ఇంత ప్రళయం ఎన్నడూ జరగలేదు. మున్నేరుకు ఆకేరు, బగ్గేరు తోడు కావడంతో ఈసారి జల ప్రళయం స్రష్టించినట్లయింది. దాదాపు 42 సె.మీ వర్షపాతం నమోదు కావడం వల్లనే ఈపరిస్థితి ఏర్పడిం ది. మున్నేరు నీటి ప్రవాహం ఎప్పుడు కూడా 20 అ డుగులకు చేరలేదు. 2023 జూలై 29న మాత్రం తొలిసారిగా 31 అడుగుల మేర మున్నేరు వరద రాగా ఈసారి ఏకంగా 36 నుంచి 39 అడుగులకు చే రింది.

కొన్ని గంటల వ్యవధిలోనే లక్షలాది క్యూసేకుల నీళ్ళు ప్రవహించాయి. దీంతో మున్నేరు పరివాహక ప్రాంతాలైన ఖమ్మం నగరంలోని పరిధిలో ని 13 డివిజన్లోని బొక్కలగడ్డ, మోతినగర్, శ్రీవెంకటేశ్వర కాలనీ, పద్మావతి కాలనీ, సారధినగర్, ఎ ప్‌సిఐ, ధ్వంసలాపురం, ప్రకాశ్ నగర్, కోటవారాయణ గ్రామం. ఖమ్మం రూరల్ మండలంలోని జ లగం నగర్, నాయుడుపేట, పెద్దతండ ఆర్ టి సి కాలనీ, రాజీవ్ గృహకల్ప, కరుణగిరి, రామన్నపేట, దానవాయిగూడెం, బికె కాలనీ, అగ్రహారం ,టి ఎన్ జివో కాలనీ సమీపంలోని ఇళ్ళన్నీ జలమయమైయ్యాయి. బహుళ అంతస్తులు కూడా నీట మునిగాయి. 5వేల మందికి పైగా నిరాశ్రములయ్యారు. బాధితులకు ఇప్పుడు తిన్నందుకు తిండి గింజలు లేకుండా నీళ్ళలో కొట్టుకుపోయాయి. నీత్యావసర వస్తువులన్నీ పరదపాలయ్యాయి విలువైనవస్తువుల న్నీ ద్వంసం అ య్యాయి.

ఇంట్లో భద్రపర్చుకున్న నగదు, బంగారం,వెండి అభరణాలు, ఇంటి రిజిస్టేషన్ డాక్యుమెంట్లు పిల్లల చదువుకునే పుస్తకాలు, నోట్ బుక్స్, ఆధార్ కార్డు,రేషన్ కార్డు, బ్యాంక్ కా ర్డు ఇలా ముఖ్యమైన డాక్యుమెంట్లు అన్ని తడిసి ముద్ద అయ్యాయి ఇంట్లో బురద,ప్రాకుతున్న పా ములు,తేళ్ళు ,వరద ధాటికి దెబ్బతిన్న ఇళ్ళను చూ స్తే భయంకరంగా కన్పిస్తున్నాయి. బొక్కల గడ్డ, మే తినగర్,రాజీవ్ గ్రహకల్ప, ప్రకాశ్ నగర్,వెంకటేశ్వ ర్ కాలనీ తదితర కాలనీలనుచూసిన వారంతా చ లించిపోతున్నారు. అధికారుల లేక్కల ప్రకారం ఖ మ్మం నగరంలో దాదాపు 5 వేల ఇళ్ళు నీట మునిగాయి. ఏడు పునరావస కేంద్రాలకు 5750 మం దిని తరలించారు. ఎప్‌సిఐ గోదాంలో ఉన్న బి య్యం నిల్వలు కూడా తడిచాయి.ఈ ప్రాంతంలో ఉన్న 200 లారీలు నీట మునిగాయి. ధ్వంసలాపురంప్రాంతంలో టెంట్ హౌజ్ లోన 20లక్షల విలువైన టెంట్ సామాగ్రి, కాల్వ వోడ్డులోని హిం దూ స్మశాన వాటిక సమీపంలోని గ్యాస్ గోదాంలోని గ్యాస్ బండలు వరదలో కొట్టుకుపోయాయి.

ముమ్మరంగా వరద సహాయక చర్యలు
పలు కాలనీల్లో ఇంట్లోని చెత్త చెదారంను, బురదమయమైన పనికిరాని వస్తువులు రోడ్డుపై వేసిన దుర్గంధంను మున్సిపల్ సిబ్బంది తొలగించే పనిలో ఉన్నారు. 8 ఫైర్ ఇంజన్, మరో 8 మినీ ఫైర్ ఇంజన్ టాంకర్స్ ద్వారా బురదను వదిలిస్తున్నారు.దాదాపు 500 మంది ట్రైనీ కానిస్టేబుళ్ళు ఇళ్ళలోని బురదను తొలగించడం కోసం,ఇంట్లోని వస్తువులన్నింటిని బయటికి తీసుకరావడానికి సహకరిస్తున్నారు.మున్సిపల్ శానిటేషన్ ఉద్యోగులు 650మంది, వరంగల్ నుంచి వచ్చిన మరు 150 మంది, నల్గొండ నుంచి వచ్చిన 50 మంది శానిటేషన్ సిబ్బందితో పాటు ప్రయివేట్ గా తాత్కాలికంగా నియమించుకున్న మరో 200మంది చేత మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లీ జ్వర సర్వే చేస్తున్నారు.చెత్తు శుభ్రం చేసిన ప్రతి ప్రదేశంలో వాటర్ ట్యాంక్స్ తో నీళ్లు కొట్టి ఆ ప్రదేశంలో బ్లీచింగ్ పిచికారి చేస్తున్నారు.లార్వా నీ కూడా పిచికారి చేసి దోమలు రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News