Wednesday, January 22, 2025

ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కూతుళ్లను చంపి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ఆస్తి కోసం కుమారుడు తన తల్లిని చంపి అనంతరం ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఆస్తి తన పేరు రాయాలని పలుమార్లు తల్లి పిచ్చమ్మతో(60) కుమారుడు వెంకటేశ్వర్లు పలుమార్లు గొడవకు దిగాడు. మళ్లీ తల్లిని ఆస్తిని తన పేరు మీద రాయాలని బతిమాలాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో తల్లిని కుమారుడు గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఇద్దరు కూతుళ్లు నీరజ(10), ఝాన్సీ(06)లను కూడా చంపేసి పారిపోయాడు. గతంలో వెంకటేశ్వర్లు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. రెండు సంవత్సరాల క్రితం భార్యను అతడు హత్య చేసినట్లు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News