- Advertisement -
న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాలు ప్రతిరోజూ వాయిదా పడుతున్నప్పుడు రాత్రుళ్లు నిరసన కొనసాగించవలసిన అవసరం లేదని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌కు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సూచించారు. పగటిపూట సమావేశాలు ప్రారంభమై ముగిసే వరకు మాత్రమే నిరసన చేస్తే బాగుంటుందని సూచించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 న ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రతిరోజూ అంతరాయాలతో వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్గే చేసిన సూచనకు సింగ్ అంగీకరించారు. ఆయన సూచనను పాటిస్తానని పేర్కొన్నారు. ఈ సూచనను ఆప్ పార్టీ అధిష్ఠానానికి తెలియజేస్తానన్నారు.
- Advertisement -