Monday, January 20, 2025

అణగారిన వర్గాలకు న్యాయంకోసం పోరు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా విపక్షాలు కలిసి పనిచేస్తాయని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే సోమవారం ఇక్కడ తెలిపారు. బెంగళూరులో ఏర్పాటు అయిన 26 ప్రతిపక్ష పార్టీల రెండు రోజుల భేటీలో తొలిరోజు సమావేశం ముగిసిన తరువాత ఖర్గే ఇతర నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. భావసారూప్య పార్టీలన్ని కలిసి ఏకైక ఉమ్మడి లక్షంతో బిజెపితో పోరాడుతాయని ఖర్గే తెలిపారు. సోమవారం సోనియా గాంధీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలకు విందు ఏర్పాటు అయింది. తరువాత ఖర్గే మాట్లాడారు.కేంద్రంలోని నిరంకుశ వాద ప్రజా వ్యతిరేక, విద్వేష, విభజన పూరితం,

ఆర్థిక అసమానతల రాజకీయాలు, కేంద్రీకృత అధికారాల నుంచి ప్రజలను విముక్తం చేయడమే ప్రతిపక్షాల ఉమ్మడి లక్షం అని ఖర్గే తెలిపారు. ఆర్థిక అసమానతలు, దోపిడి సాగుతోందన్నారు. దీనిని ఎదుర్కొనేందుకు భావసారూప్య పార్టీలు కలిసికట్టుగా సాగే దిశలో పలు అడుగులు పడుతున్నాయని, బెంగళూరు భేటీ కీలకమైనదని ఖర్గే చెప్పారు. భారతదేశం రాజ్యాంగ సిద్ధాంతాలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత, సౌభాతృత్వం ప్రాతిపదికగా సాగాల్సి ఉందన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల ప్రజలకు న్యాయం జరిగి, వారికి వ్యవస్థల పట్ల పూర్తి విశ్వాసం కలిగేలా చేయడమే ప్రతిపక్షాల ఆలోచన అని తెలిపారు. ప్రతిపక్ష ఐక్యత దిశలో పలు కీలక విషయాలపై మంగళవారం కొనసాగే చర్చలలో దృష్టి సారిస్తామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News