- Advertisement -
న్యూఢిల్లీ : 2014లో బీజేపీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఖాళీల్లో రెట్టింపై ఆ సంఖ్య 30 లక్షలకు చేరుకుందని, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. నరేంద్రమోడీ ప్రభుత్వం దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకం అయినందున ఆయా ఉద్యోగాలను భర్తీ చేయలేదని ఆరోపించారు. 2014 వరకు కేంద్ర ప్రభుత్వశాఖల్లో 11.57 శాతం ఉద్యోగ ఖాళీలు ఉండగా, 2022నాటికి ఆ సంఖ్య 24.3 శాతానికి పెరిగిందంటూ ఓ ఛార్ట్‌ను ఆయన షేర్ చేశారు.
- Advertisement -