Monday, January 20, 2025

ఈనెల 5న ఇండియా కూటమి ఎంపీల సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈనెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాజ్యసభ లోని విపక్ష నాయకుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలకు చెందిన ఎంపీలతో ఈనెల 5న సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విపక్షాలు తమ వూహాన్ని నిర్ణయిస్తాయని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. రాజ్‌మార్గ్ లోని ఖర్గే అధికారిక నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది.

అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిటో ఇప్పటివరకు తెలియక పోయినా, వివిధ అంశాలపై అధికార పార్టీ బీజేపీని సమైక్యంగా ఎదుర్కోడానికి ఇండియా కూటమి సమన్వయంతో పనిచేస్తుందని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలన్నీ సమైక్యంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News