Sunday, December 22, 2024

సీట్ల సర్దుబాటు చర్చలు త్వరలోనే కొలిక్కి

- Advertisement -
- Advertisement -

ఇండియా కూటమి నేతలతో ఖర్గే సంప్రదింపులు

న్యూఢిల్లీ: ప్రతిపక్ష కూటమిలో మరింత సమన్వయం సాధించేందుకు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చర్చలుసంప్రదింపులు జరుపుతున్నట్లు కాంగ్రెస్ వెల్లడించింది. వివిధ ప్రతిపక్ష పార్టీలతో సీట్ల సంపకం చర్చలను కాంగ్రెస్ ఇటీవలే ప్రారంభించింది. ప్రతిపక్ష ఇండియా కూటమికి త్వరలోనే కన్వీనర్‌ను ప్రకటించనున్నట్లు కూటమి గతంలోనే ప్రకటించింది. కన్వీనర్ పదవికి బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధ్యక్షుడు నితీశ్ కుమార్ పేరు ప్రధానంగా చక్కర్లు కొడుతోంది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించడానికి జతకట్టిన 28 పార్టీల ఇండియా కూటమికి ఒక కార్యాలయం ఉండాలని, అదే విధంగా ఒక అధికార ప్రతినిధి ఉండాలన్న డిమాండ్లు కూడా ముందుకు వస్తున్నాయి. ప్రతిపక్ష కూటమి మధ్య మరింత సన్నిహిత సమన్వయం ఉండేలా చూసేందుకు అవసరమైన స్వరూపం కోసం ఇండియా కూటమి నేతలతో ఖర్గే సంప్రదింపులు జరుపుగున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. నితీశ్ కుమార్‌తోసహా కూటమిలోని నాయకులందరితో ఖర్గే మాట్లాడారని, త్వరలోనే కూటమికి సంబంధించిన కీలక అంశాలై నిర్ణయాలు ఉంటాయని ఆయన చెప్పారు. కూటమిలోని అన్ని రాజకీయ పార్టీలతో జరుగుతున్న చర్చలు కొన్ని తుది దశలో ఉండగా కొన్ని ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఆయన తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో సీట్ల పంపకంపై చర్చలు ఒకటి రెండు రోజుల్లో జరుగుతాయని జైరాం రమేష్ తెలిపారు. సీట్ల పంపకంపై నాయకుల మధ్య స్పష్టత ఉందని ఆయన చెప్పారు. సీట్ల సర్దుబాట్లపై అన్ని పార్టీల మధ్య స్పష్టత వస్తోందని ఆయన వివరించారు. మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లడానికి కాంగ్రెస్ నాయకత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం మహారాష్ట్రలో సీట్ల పంపకంపై శివసేన(యుబిటి), నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(శరద్ పవార్ వర్గం), ఉత్తర్ ప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీతో కాంగ్రెస్ ప్రాథమిక చర్చలు మంగళవారం జరిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏర్పాటు చేసిన సీట్ల పంపకం కమిటీ కన్వీనర్ ముకుల్ వాస్నిక్ నివాసంలో ఈ చర్చలు జరిగాయి.

ఈ చర్చలలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సల్మాన్ ఖుర్షీద్ కూడా పాల్గొన్నారు. సీట్ల పంపకంపై శరద్ పవార్‌ఎన్‌సిపి), ఉద్ధవ్ థాక్రే, ఖర్గే చర్చలు జరుగుఆయని, పవార్, థౠక్రే జనవరి 14, 15 తేదీలలో సోనియా గాంధీతో భేటీ అవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో పొత్తులపై కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ మధ్య విడిగా చర్చలు జరిగాయి. ఇందులో రాంగోపాల్ యాదవ్, జావేది అలీ పాల్గొన్నారు. జనవరి 12న సమాజ్‌వాది పార్టీ, ఆప్ నాయకులతో మరోసారి చర్చలు జరుగాయని వర్గాలు తెలిపాయి. సీట్ల పంపకాలను ఖరారు చేయడానికి ఇండియా కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాలతో వివిధ రాష్ట్రాలకు సంబంధించి విడివిడిగా కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని ఓడించడమే లక్షంగా అన్ని స్థానాలలో ఉమ్మిడిగా పోటీచేయాలని ఇండియా కూటమి కృతనిశ్చయంతో ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News