Monday, December 23, 2024

ఓవర్ టు ఖర్గే

- Advertisement -
- Advertisement -

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్నాటకలో నూతన ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించారు. రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తరువాత ఆదివారం ఇక్కడ కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో జరిగిన ఈ అనధికారిక సిఎల్‌పిలో ఏకవాక్య తీర్మానం వెలువరించారు. పార్టీ తరఫున తదుపరి ముఖ్యమంత్రిని ఎంపికచేసే బాధ్యతను పార్టీ అధ్యక్షులు గౌరవనీయ మల్లిఖార్జున ఖర్గేకు కట్టబెడుతున్నట్లు ఈ తీర్మానంలో తెలిపారు.

ఇది ఏకగ్రీవ తీర్మానంగా పేర్కొన్నారు. ఈ భేటీకి ముందు కాంగ్రెస్ పరిశీలకులు పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన కెసి వేణుగోపాల్‌తో కలిసి సిద్ధరామయ్య, డికె శివకుమార్‌లతో మాట్లాడారు. కర్నాటకలో కాంగ్రెస్ సారధ్యంలో కొత్త ప్రభుత్వం గురువారం(17వ తేదీ) ప్రమాణస్వీకారం చేస్తుంది. కేబినెట్ ప్రమాణస్వీకారం తేదిని తెలిపిన కాంగ్రెస్ వర్గాలు ఆదివారం తమ ప్రకటనలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేది వెల్లడించలేదు. బెంగళూరులో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రి యాంక గాంధీ, వీరికి తోడుగా పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, భావసారూప్యత గల ఇతర పార్టీ ల నేతలు హాజరవుతారు. ఒకటిరెండురోజుల్లో కర్నాటక కేబినెట్ పూర్తి స్వరూపం గురించి వెల్లడిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే సిఎం పదవి ఎవరిని వరిస్తుందనే అంశంపై సస్పెన్స్ మిగిలింది.

ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో స్థానికంగా ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమంత్రి ఎవరు? అనే విషయంపై అభిప్రాయాలు తీసుకున్నారని వెల్లడైంది. సిఎల్‌పి భేటీకి పార్టీ కేం ద్ర పరిశీలకులుగా సుశీల్‌కుమార్ షిండే, జితేంద్రసింగ్, దీపక్ బబారియాలను పార్టీ అధ్యక్షులు పరిశీలకులుగా పంపించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలిపారు. సిఎల్‌పి నేత ఎంపిక ప్రక్రియను వీరు పర్యవేక్షిస్తారని వివరించారు. మరో వైపు సిఎల్‌పి భేటీ తరువాత కొందరు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రముఖులు మాట్లాడుతూ సిద్ధరామయ్య పేరును ముఖ్యమంత్రిగా ఖరారు చేశారని, ఉపముఖ్యమంత్రిగా డికె శివకుమార్‌ను ఒప్పించారని తెలిపారు. దీనికి సంబంధించి ఢిల్లీలోని పార్టీ ప్రముఖులిద్దరి నుంచి వీరికి స్పష్టమైన సంకేతాలు అందాయని , ఇక వీరి పేర్లు అధికారికంగా వెల్లడికావడమే తరువాయి అని వివరించారు.

అంతా సజావుగా సాఫీగా సాగుతుంది : ఖర్గే
పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను స్వీకరించి, పార్టీ అధిష్టానానికి పరిశీలకులు విషయంతెలియచేస్తారని, ఆ తరువాత ముఖ్యమంత్రి ఎంపిక, పేరు వెల్లడి జరుగుతుందని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఆదివారం తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అంతా సజావుగా సాగిందని, పార్టీకి ప్రయోజనం చేకూరిందని, ఇక ప్రభుత్వ ఏర్పాటు కూడా ఇదే విధంగా సాఫీగా ఉంటుందని ఢిల్లీలో ఆయన విలేకరులకు తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ఈ నెల 24తో అధికారికంగా ముగుస్తుంది. ఈలోగా చాలా ముందుగానే తమ ప్రభుత్వ స్థాపన ప్రక్రియ సాఫీగా సాగుతుందని ఆయన వివరించారు. కర్నాటక నుంచి ఖర్గే ఆదివారం ఉదయమే దేశ రాజధానికి చేరారు. పార్టీ కార్యాలయంలో, నివాసంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాల సభలో కాంగ్రెస్‌కు 135 స్థానాలు దక్కాయి. ఆదివారం ఓ ఇండిపెండెంట్ మహిళా ఎమ్మెల్యే లత కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఖర్గే దేశరాజధానికి చేరుకోగానే విమానాశ్రయంలోనే విలేకరులతో మాట్లాడారు. పార్టీ పరిశీలకులు బెంగళూరు వెళ్లారని, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని సాయంత్రానికి ఢిల్లీకి వస్తారని ఆయన ఉదయం తెలిపారు. ఆ తరువాత ఆయన 10 రాజాజీ మార్గ్ నివాసానికి వెళ్లారు.

కర్నాటకలో పార్టీ విజయం ప్రజల విజయం అని ఖర్గే తెలిపారు. కర్నాటక ప్రజలు బిజెపిని తిరస్కరించారు. ప్రజలు చాలా ఏళ్లుగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి వంటి తీవ్ర సమస్యలతో సతమతమయ్యారని, దీనితో బిజెపి పట్ల విసిగివేసారి వారు కాంగ్రెస్‌ను స్వాగతించారని తెలిపారు. కేబినెట్ తొలి భేటీనాడే పంచ భరోసాలకు ప్రాణం పోస్తారని తెలిపారు. వీటిని తూచాతప్పకుండా అమలు చేస్తామన్నారు. కర్నాటకలో ఎన్నికల ప్రచార దశలో జరిగింది అంతా కూడా గతం . దీనిని అంతా మరిచిపోదామని, కర్నాటక ప్రగతికి కష్టపడి పనిచేస్తామని ఖర్గే చెప్పారు. రాష్ట్రానికి రాబోయేది కొత్త ముఖ్యమంత్రా ? లేక పాతవారే ఉంటారా? అనే ప్రశ్నకు ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. బెంగళూరుకు ముగ్గురు పరిశీలకులు వెళ్లారని , ఎమ్మెల్యేల మనోగతాలను తీసుకుని , పార్టీ అధిష్టానం ముందుంచుతారు. పేరు అప్పుడు వెల్లడవుతుందని ఖర్గే వివరించారు.

సిద్ధ్దరామయ్య, డికె మధ్య తీవ్రపోటీ
అసెంబ్లీ ఎన్నికలలో సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటుకు అర్హత సాధించుకున్న కాంగ్రెస్‌లో ఇప్పుడు పార్టీ తరఫున ముఖ్యమంత్రి పదవికి సీనియర్ నేత, మాజీ సిఎం సిద్ధరామయ్య, పిసిసి అధ్యక్షులు, ట్రబుల్ షూటర్‌గా పేరొందిన డికె శివకుమార్ మధ్య పోటీ నెలకొని ఉంది. మరికొందరు కూడా సిఎం పదవిని ఆశిస్తున్నారు.

సిఎల్‌పి భేటీ హోటల్ వద్ద మద్దతుదార్ల నినాదాలు
పార్టీలో సిఎం పీఠం కోసం డికె శివకుమార్, సిద్ధరామయ్య మధ్య తీవ్రస్థాయి పోటీ ఉందనే విషయం సిఎల్‌పి భేటీ అయిన హోటల్ వద్ద పరిస్థితితో స్ప ష్టం అయింది. హోటల్ వెలుపల డికె మద్దతుదార్లు, సిద్ధరామయ్య అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలకు దిగారు. జిందాబాద్‌లతో ఈ ప్రాంగణం మా ర్మోగింది. మరో వైపు సిద్ధరామయ్య నివాసం వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాబోయే సిఎం సిద్ధరామయ్యకు శుభాకాంక్షలు అని రాశారు. కాగా స్థానికంగా డికె నివాసం వద్ద వెలిసిన పోస్టర్లలో కాబోయే సిఎం డికెకు జన్మదిన శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. సోమవారం డికె జన్మదినం.

ఇంతగా కష్టపడ్డాను, రేస్‌లో ఉన్నాను: డికె
తాను కూడా సిఎం పదవికి రేస్‌లో ఉన్నానని డికె ఉదయం తెలిపారు. తాను ఇంతవరకూ పార్టీకోసం పాటుపడుతూవచ్చానని, తనంతతానుగా ఏదీ కోరలేదన్నారు. అందరిసాయంతో ముందుకు వెళ్లే పద్ధ తి తనదని చెప్పారు. సిఎల్‌పి ద్వారానే సిఎం ఎవరనేది ఖరారు అవుతుందని చెప్పిన డికె తనకూ సిద్ధరామయ్యకు విభేదాలు ఉన్నాయనే వార్తలను తోసిపుచ్చారు. పార్టీకోసం శ్రమించిన వారికే తగు ప్రా ధాన్యత ఉండాలని ఆయన తూమకూరు సమీపంలోని నోనావినాకెరెలోవిలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఉప ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత సిఎల్‌పి నేత సిద్ధరామయ్య, దినేష్ గుం డూరావులు రాజీనామాలకు దిగారని, ఈ దశలో పార్టీ అప్పటి అధ్యక్షురాలు సోనియా గాంధీ తనపై నమ్మకం ఉంచి పిసిసి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారని ఈ విషయాలను ఇప్పుడు ప్రస్తావించాల్సి వ స్తోందన్నారు. పార్టీ కోసం తాను రాత్రింబవళ్లూ క ష్టించినట్లు కనకపురా స్థానం నుంచి లక్షకు పైగా ఓ ట్ల ఆధిక్యతతో గెలిచిన డికె చెప్పారు. తనకు సిద్ధరామయ్యకు విభేదాలు లేవని తెలిపిన డికె తాను విమర్శలకు తావిచ్చే వ్యక్తిని కానని, పరిస్థితులను బట్టి మౌనంగా నా దారిన నేను వెళ్లే వాడినని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News