Wednesday, January 22, 2025

జి20 విందుకు ఖర్గేకు అందని ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాష్ట్రపతి శనివారం ఆతిథ్యమిస్తున్న జి20 విందు సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఆహ్వానం అందలేదు. ఈ విషయాన్ని ఆయన పార్టీ కార్యాలయ వర్గాలు శుక్రవారం తెలిపాయి. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డి దేవెగౌడలకు ఆహ్వానం అందినట్లు తెలిసింది. ఈ విందు సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ జి20 ఆహ్వాన పత్రికలో ఇండియాకు బదులుగా భారత్ అని ప్రస్తావించడం పెద్ద వివాదాన్నే సృష్టించింది. అధికారి ఆహ్వానాలలో మొదటి సారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం సంచలనం సృష్టించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News