Monday, December 23, 2024

ప్రజాస్వామ్య, రాజ్యాంగాలను పరిరక్షిస్తాం : ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయని, దేశ ఐక్యత, సమగ్రత, సోదరత్వం, సామరస్యం కోసం వాటిని పరిరక్షిస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆనాడు స్వాతంత్య్ర పోరాటంలో అశేష సంఖ్యలో త్యాగాలు చేసిన అమర మూర్తులకు ఆయన నివాళులర్పించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూతోపాటు లాల్‌బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, వాజ్‌పాయ్ తదితర మాజీ ప్రధానులు దేశానికి అందించిన మేలు, అభివృద్ధికి తీసుకున్న చర్యలను శ్లాఘించారు.

ఈనాడు ప్రతిపక్షాల గొంతునొక్కడానికి కొత్త వ్యూహాలు ప్రయోగిస్తున్నారని, సిబిఐ, ఇడి , ఇంకమ్‌టాక్స్ దాడులు జరుగుతున్నాయని, ఎన్నికల కమిషన్ బలహీనమైందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌లో విపక్ష ఎంపీల గొంతును అణచివేయడానికి వారిని సస్పెండ్ చేస్తున్నారని, మైకులు ఆఫ్ చేయిస్తున్నారని, ప్రివిలేజ్ మోషన్స్ అమలు చేస్తున్నారని ఖర్గే ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News