Wednesday, January 22, 2025

నెహ్రూ కాలంలోనే అనేక పరిశ్రమలు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో నెహ్రూ కాలంలోనే అనేక పరిశ్రమలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. బిహెచ్ఈఎల్ వంటి అనేక పరిశ్రమలు కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పెట్టిన పరిశ్రమలను మోడీ సర్కార్ అమ్ముకుంటోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో కాంగ్రెస్ గతంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. బిఆర్ఎస్ సర్కార్ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంచిందని ఆరోపించారు. కెసిఆర్, మోడీ.. పేదలకు మరింత పేదలుగా చేస్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్, మోడీ ధనవంతులకే కొమ్ముకాస్తున్నారు. కెసిఆర్ అవినీతి తెలంగాణ నుంచి ఢిల్లీకి పాకిందన్నారు. అటు ఖమ్మం పట్టణంలో ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రయాంకగాంధీ ప్రచారం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News