Monday, December 23, 2024

అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి పక్కా వ్యూహం అవసరం : ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నవంబరులో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికని సమర్థమైన వ్యూహం అవసరమని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సూచించారు. సమన్వయం, క్రమశిక్షణ, ఐక్యతతో నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే ప్రసంగించారు. షెడ్యూల్డ్ కులాలు(ఎస్‌సి), షెడ్యూల్డ్ తెగలు (ఎస్‌టి), ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసి) కు సామాజిక న్యాయం, హక్కులు సాధించడానికి జాతీయస్థాయిలో కులగణన చేపట్టక తప్పదని డిమాండ్ చేశారు.

సంక్షేమ పథకాల్లో వారికి సరిగ్గా దక్కాల్సిన వాటా సాధించడానికి సామాజిక ఆర్థిక డేటా అవసరమని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ అధికారం లోకి వస్తే మహిళా రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేస్తుందని చెప్పారు. ఈనాడు దేశం ద్రవ్యోల్బణం, నిరుద్యోగం,పాత పెన్షన్ పథకం అమలులో ప్రభుత్వ వైఫల్యం తదితర సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. పాలక పార్టీ విభజించే ఎత్తుగడలు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలను దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య సుస్థిరతకు ముప్పుగా మారాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News