Monday, December 23, 2024

కాశ్మీర్ పండిత్‌ల దుస్థితికి బిజెపియే కారణం…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాశ్మీర్ పండిత్ ఉద్యోగులు ఆందోళనపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పందించారు. కాశ్మీర్లో వారు ఎదుర్కొంటున్న దుస్థితికి బిజెపియే కారణమని ఆరోపించారు. కాషాయం పార్టీ అవలంబిస్తున్న ఉపయోగించుకుని విసర్మించడమనే విధానం వల్లే కాశ్మీర్లో పండిత్‌ల కష్టాలకు కారణంగా పేర్కొన్నారు. పండిత్‌లపై జరుగుతున్న కుట్రకు బిజెపి బాధ్యతవహించాలని ఖర్గే అన్నారు.

ట్వీట్టర్ వేదికగా హస్తం పార్టీ అధినేత ఖర్గే మాట్లాడుతూ.. గత 245రోజులకుపైగా కాశ్మీర్ పండిత్ ఉద్యోగులు తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్నారు. నెలల తరబడి వారికి జీతాలు చెల్లించకుండా నిలిపివేశారు. పండిత్‌ల భద్రతపై కేంద్రం రాజీ ధోరణి అవలంబిస్తుందని విమర్శించారు. కాగా గతేడాది మేలో జమ్ము కాశ్మీర్లోని జిల్లాల్లో రాహుల్ భట్ అనే కాశ్మీర్ పండిత్ ఒకరిని ఉగ్రవాదులు ప్రభుత్వ కార్యాలయంలోనే కాల్చి చంపారు.

దీంతో కాశ్మీర్ పండిత్‌లు విధులు చేపట్టేందుకు నిరాకరిస్తూ ఆందోళన చేపట్టారు. పండిత్‌ల డిమాండ్‌లను జేకే పాలన యంత్రాంగం ఆమోదించినా కొంతమంది ఉద్యోగులు తమను కాశ్మీర్ వెలుపల విధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈక్రమంలో విధులకు హాజరుకాని ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించకుండా నిలిపివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News