Wednesday, January 22, 2025

ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తులకు సైనిక్ స్కూళ్లు అప్పగించడం తగదు: ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను పాటిస్తున్న వ్యక్తులకు సైనిక్ స్కూళ్లను అప్పగించడం పట్ల కాంగ్రెస్ అద్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగంలో నిర్మించిన సైనిక్ స్కూళ్లను ప్రైవేట్ రంగానికి అప్పగిస్తున్నామన్న పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులకు ధారాదత్తం చేస్తున్నారని ఖర్గే ఆరోపించారు.

బృందావన్(ఉత్తర్ ప్రదేశ్), సోలన్(హిమాచల్), రోహతక్(హర్యానా), తవాంగ్(అరుణాచల్) వంటి అనేక స్కూళ్లను బిజెపిఆర్-ఎస్‌ఎస్ వ్యక్తులకు అప్పగించారని, ఇది తగదని ఎక్స్ వేదికగా ఖర్గే విమర్శించారు. అన్నిటిని ప్రైవేట్ రంగానికి అప్పగించేస్తే పేదలు, అణగారిన వర్గాలైన దళితులు, గిరిజనులు, వెనుక బడిన తరగతులకు చెందిన పిల్లలు ఎక్కడ చదువుకుంటారని ఆయన ప్రశ్నించారు. సైన్యాన్ని సైన్యంగానే ఉండనివ్వండి. రాజకీయాలు చేయడానికి వేరే రంగాలు చాలా ఉన్నాయి అంటూ ఖర్గే కేంద్ర ప్రభుత్వానికి చూచించారు.

అగ్నివీర్ వంటి తుగ్లకీ పథకాలను తీసుకువచ్చి యువత మనోస్థైర్యాన్ని మోడీ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. అగ్నివీర్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువజనులు ఉద్యమిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎవరినీ లక్ష పెట్టడం లేదని, అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. సైన్యానికి ఒక ర్యాంకు, ఒకే పెన్షన్ అని 2014లో హర్యానాలో మోడీ హామీ ఇచ్చారని, ఇప్పటికీ ఆ హామీ నెరవేరలేదని ఖర్గే విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News