Monday, December 23, 2024

బెంగాల్ రైలు ప్రమాదం… మోడీ ప్రభుత్వంపై ఖర్గే ఫైర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రైల్వే మంత్రిత్వశాఖ ‘దారుణ నిర్వహణ లోపానికి’ మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదంలో ప్రాణ నష్టం పట్ల ఖర్గే సంతాపం వ్యక్తం చేశారు. ‘పశ్చిమ బెంగాల్ జల్పాయిగురిలో కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం పట్ల ఎంతగానో విచారిస్తున్నా. ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు’ అని ఖర్గే తెలిపారు. ‘ప్రమాద దృశ్యాలు బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఈ విషాద సమయంలో వారిలో ప్రతి ఒక్కరికీ మా సంఘీభావం, సంతాపం తెలియజేస్తున్నాం. క్షతగాత్రలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. మృతులకు వెంటనే, పూర్తి పరిహారం అందజేయాలి’ అని ఖర్గే అన్నారు.

గడచిన పది సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వశాఖ ‘నిర్వహణలో దారుణంగా విఫలమైంది’ అని ఆయన ఆరోపించారు. ‘రైల్వే మంత్రిత్వశాఖను ‘కెమెరా ఆధారిత’ స్వోత్కర్షకు వేదికగా రైల్వే మంత్రిత్వశాఖను మోడీ ప్రభుత్వం ఏవిధంగా మార్చిందో నొక్కిచెప్పడం బాధ్యతాయుత ప్రతిపక్షంగా మా కర్తవ్యం’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు తెలిపారు. ‘ఈ దుర్ఘటన ఈ దారుణ వాస్తవాన్ని మరొకసారి గుర్తు చేస్తోంది’ అని ఖర్గే పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News