Monday, December 23, 2024

పిఎం కిసాన్ లబ్ధిదారుల్లో కోత: మోడీ ప్రభుత్వంపై ఖర్గే ధ్వజం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కిసాన్ పథకాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అధక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం మోడీ సర్కారుపై ధ్వజమెత్తారు. లబ్ధిదారులైన రైతులను తగ్గించేలా ప్రతి వాయిదాకి మోడీ ప్రభుత్వం కోత విధిస్తుందని ఖర్గే ఆరోపించారు. ఈ మేరకు ఖర్గే ట్విట్టర్‌లో గ్రాఫ్‌ను పోస్టు చేశారు. ఆహారాన్ని అందించే రైతుల హక్కులను మోడీ ప్రభుత్వం హరించివేస్తుందన్నారు. 14.5కోట్ల రైతులు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని చెపుతున్నా.. వాస్తవానికి ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్‌కి వీరి సంఖ్య తగ్గుతుందని ఖర్గే తెలిపారు.

రైతుల హక్కులను దూరం చేయడానికి మోడీ ఎవరని ఖర్గే ప్రశ్నించారు. కాగాప్రధానమంత్రి సమ్మాన్ నిధి (పిఎం కిసాన్) పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6వేలు ఆర్థిక సహకారాన్ని కేంద్రం అందిస్తోంది. ఈ మొత్తాన్నిప్రతి నాలుగు నెలలుకు ఒకసారి రూ.2వేలు చొప్పున వాయిదాల పద్ధతిలో చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది. అయితే కేంద్రం పేర్కొన్న సంఖ్యలో లబ్ధిదారులు లేరని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.

Kharge slams Modi’s Govt over PM Kisan Scheme

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News