Wednesday, January 22, 2025

కొత్త పార్లమెంట్ భవన ప్రారంభానికి రాష్ట్రపతికి అందని ఆహ్వానం : ఖర్గే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, అంతకన్నాముందు రాష్ట్రపతిగా ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌లకు ఆహ్వానాలు అందలేదని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను అగౌరవ పరుస్తోందని, రాష్ట్రపతి కార్యాలయాన్ని లాంఛన ప్రాయం చేసిందని ఖర్గే ఆరోపించారు.

ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభిస్తారని లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే మోడీ ప్రభుత్వం దళిత, గిరిజన వర్గాల నుంచి రాష్ట్రపతులను ఎన్నికయ్యేలా చూసినట్టు కనిపిస్తోందని ఖర్గే ధ్వజమెత్తారు. పార్లమెంట్ దేశ అత్యున్నత శాసన వ్యవస్థని, రాష్ట్రపతి ప్రభుత్వంతోపాటు , దేశ పౌరులందరి ప్రతినిధి అని ఖర్గే ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News