Sunday, January 19, 2025

కుల గణన కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసిన ఖర్గే!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కుల గణన (అప్ టు డేట్ క్యాస్ట్ సెన్సస్) చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి రాశారు. కుల గణనకు సంబంధించిన నమ్మకమైన డేటా లేకపోవడం వల్ల సామాజిక న్యాయం, సాధికారత కార్యక్రమాలు…ప్రధానంగా ఓబిసికి అందడంలేదని, అసంపూర్ణంగానే ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

‘నవీన కుల గణన కోసం భారత జాతీయ కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్‌ను మరోసారి రికార్డు చేయమని నేను మీకు రాస్తున్నాను. నా సహచరులు, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు, నేనూ అనేక సందర్భాల్లో పార్లమెంటు ఉభయసభల్లో ఈ డిమాండ్‌ను లేవనెత్తాము’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు.

తన లేఖలో ‘2011-12లో 25కోట్ల కుటుంబాలను కవర్ చేస్తూ యుపిఎ ప్రభుత్వం మొదటిసారిగా సామాజిక, ఆర్థిక, కుల గణన(ఎస్‌ఈసిసి) నిర్వహించిందన్న సంగతి మీకు తెలుసు. అయితే అనేక కారణాల వల్ల, 2014 మే నెలలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్, ఇతర పార్టీ ఎంపీలు దానిని విడుదల చేయాలని డిమాండ్ చేసినప్పటికీ, కుల డేటాను ప్రచురించలేదు’ అన్నారు.

‘కుల గణన అప్‌డేట్ చేయకపోవడం వల్ల నమ్మకమై డేటా లేదు. సామాజిక న్యాయం, సాధికారత కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. ముఖ్యంగా ఓబిసిలకు అందాల్సినవి అసంపూర్తిగా ఉంటున్నాయి. సెన్సెస్ నిర్వహణ అన్నది కేంద్ర ప్రభుత్వ బాధ్యత’ అని ఖర్గే తెలిపారు. ఖర్గే ఈ లేఖను ఏప్రిల్ 16వ తేదిన రాశారు. 2021లో నిర్వహించాల్సిన దశాబ్ది జనాభా గణనను కూడా ఇంకా నిర్వహించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ‘సెన్సెస్‌లో సమగ్ర కుల గణన కూడా అంతర్భాగం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము’ అని స్పష్టం చేశారు. మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీకి రాసిన లేఖను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ రీట్వీట్ చేశారు.

ఇదిలావుండగా కోలార్‌లో రాహుల్ గాంధీ ‘జై భారత్’ ర్యాలీలో ప్రసంగిస్తూ ‘యుపిఎ ప్రభుత్వం 2011లో కుల ఆధారిత జనభా గణన (సెన్సెస్) నిర్వహించింది. అన్ని కులాల వారి లెక్కలు రాసుకున్నారు. మిష్టర్ ప్రైమ్ మినిష్టర్, మీరు ఓబిసిల గురించి మాట్లాడుతుంటారు. డేటాను బహిరంగ పరచండి. ఎంత మంది ఓబిసీలు, దళితులు, గిరిజనులు దేశంలో ఉన్నారన్నది అందరికీ తెలియనివ్వండి’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News