Wednesday, January 22, 2025

ఖర్గేదే తుది నిర్ణయం

- Advertisement -
- Advertisement -

సిఎం ఎంపికపై ఢిల్లీలో మాణిక్యం ఠాగూర్

ఎఐసిసి పరిశీలకులను ఢిల్లీకి రావాలని ఆదేశించిన అధిష్ఠానం
గచ్చిబౌలి హోటల్‌లో ముగిసిన కాంగ్రెస్ సిఎల్‌పి సమావేశం
64మంది ఎంఎల్‌ఎలు హాజరు సుమారు గంటపాటు సాగిన సమావేశం

సిఎల్‌పి భేటీలో ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రేవంత్‌రెడ్డి

బలపరిచిన 10మంది ఎంఎల్‌ఎలు సిఎల్‌పి సమావేశానికి
ముందు డికె శివకుమార్‌తో భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం అభ్యర్థిపై మల్లికార్జున ఖర్గేదే తుది నిర్ణయమని ఢిల్లీ పెద్దలు పేర్కొన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సిఎం అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలాల్సి ఉంది. నేడు ఎఐసిసి ప రిశీలకులతో పాటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌తో మల్లికార్జున ఖర్గే సమావేశం నిర్వహించి కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఎఐసిసి నాయకులు పేర్కొన్నారు. అయి తే ఢిల్లీలో సోమవారం సాయంత్రం సోనియాగాం ధీ నివాసంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశంలో సిఎం అభ్యర్థికి సంబంధించి చర్చ జరగలేదని ఢిల్లీలో విలేకరులతో కాంగ్రెస్ సీనియర్ నా యకులు జైరాం రమేష్ పేర్కొనగా, ఎఐసిసి స్క్రీనింగ్ క మిటీ సభ్యుడు మాణిక్యం ఠాగూర్ సైతం ఢిల్లీలో మాట్లాడుతూ నేడు ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎఐసిసి పరిశీలకులతో మాట్లాడిన తరువాతే అన్ని విషయాలను వెల్లడిస్తారని పేర్కొనడం విశేషం.
రాజ్‌భవన్ నుంచి వెళ్లిపోయిన అధికారులు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, దీప్‌దాస్ మున్షీ, మాణిక్‌రావు ఠాక్రేలతో పాటు మరికొందరిని ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్ఠానం సూచించడంతో వారంతా హుటాహుటీన ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించిన తరువాతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు ప్రకటించాలని అనుకున్నారు. ఆలోపే ఢిల్లీ నుంచి ఎఐసిసి పరిశీలకులకు పిలుపు వారంతా వెంటనే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. చివరకు సోమవారం ప్రమాణస్వీకారం ఉండదని పేర్కొనడంతో జిఎడితో పాటు పలు శాఖల అధికారులు రాజ్‌భవన్ నుంచి వెళ్లిపోయారు.
సిఎల్‌పి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి
సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్ సిఎల్‌పి సమావేశం ముగిసింది. సిఎల్‌పి సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెం దిన 64 మంది ఎంఎల్‌ఎలు హాజరయ్యారు. పార్టీ ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. గెలిచిన ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా చర్చించిన ఎఐసిసి పరిశీలకులు ఎంఎల్‌ఎల అభిప్రాయాలను పరిశీలించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆ పార్టీ శాసనసభా పక్షం సమావేశమై ఓ నిర్ణయానికి వచ్చింది. సిఎల్‌పి నేత ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికి అప్పగించాలని ఈ సమావేశంలో తీర్మానించినట్లు కర్ణాటక పిసిసి చీఫ్, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ లో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశమై ఈ కీలక నిర్ణ యం తీసుకుంది. భేటీ ముగియడంతో అధిష్ఠానంతో సం ప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది గవర్నర్‌కు తె లియజేయనున్నారు. ఈ సమావేశంలో సిఎల్‌పి నేత ఎం పికపై చర్చించినట్లు కర్ణాటక పిసిసి చీఫ్, డిప్యూటీ సిఎం డికె శివకుమార్ తెలిపారు. ఎంపిక బాధ్యతను ఎఐసిసి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి తీర్మానం పెట్టగా ఎంఎల్‌ఎలు దానిని బలపరిచారని ఆయన వెల్లడించారు. అనంతరం సిఎల్‌పి నేత ఎంపిక బాధ్యతను ఎంఎల్‌ఎలు అధిష్ఠానానికే అప్పగించారన్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తామని ఎంఎల్‌ఎలు తీర్మానించినట్లు శివకుమార్ పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని అధిష్ఠానానికి పంపినట్లు పరిశీలకుడు డికె శివకుమార్ వెల్లడించారు.
పార్క్‌హయత్‌లో డికెతో సమావేశం
రెండు రోజులుగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్, ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు దీపాదాస్ మున్షీ, ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేలు హైదరాబాద్‌లో మకాం వేశారు. ఆదివారం రాత్రే ఎన్నికైన ఎంఎల్‌ఎలతో సమావేశం కావాలని నిర్ణయించారు. నియోజకవర్గాల్లో ఉన్న ఎంఎల్‌ఎలందరూ హైదరాబాద్ చోరుకోవడానికి సమయం పట్టడంతో భేటీని వాయిదా వేసి సోమవారం గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లో సమావేశమయ్యా రు. అయితే కీలకమైన సిఎల్‌పి భేటీకి ముందే హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్లో ట్రబుల్ షూటర్ డికె శివకుమార్‌తో భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు భేటీ అయ్యారు. సిఎం అభ్యర్థితో పాటు మంత్రివర్గ కూర్పుపై వీరంతా డికె చర్చించినట్టుగా తెలిసింది.ఈ భేటీ వాడివేడీగాసాగినట్టు తెలిసింది.

సిఎల్‌పి నేత ఎంపిక బాధ్యత అధ్యక్షుడు ఖర్గేకు
సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అప్పగించింది. సుమారు గంట పాటు సాగిన సిఎల్‌పి భేటీలో ఏకవాక్య తీర్మానాన్ని పరిశీలకులు ఢిల్లీకి పంపించారు. అయితే, రేవంత్‌రెడ్డి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టగా తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా 10మంది ఎంఎల్‌ఎలు బలపరిచారు. అనంతరం ఎంఎల్‌ఎల అభిప్రాయ సేకరణ ముగిసింది. ఈ సిఎల్‌పి భేటీకి ఎఐసిసి పరిశీలకులు డికె శివకుమార్‌తో పాటు దీప్‌దాస్ మున్షీ, జార్జ్, అజయ్, మురళీధరన్‌లు పాల్గొన్నారు.
ఢిల్లీలోని సోనియా నివాసంలో సమావేశం
ఈ కాంగ్రెస్ అధిష్టానం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాం గ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం అయ్యిం ది. ఈ సమావేశంలో సిఎం అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించిన తరువాతే కాంగ్రెస్ పార్టీ రాజ్‌భవన్‌కు సిఎం అభ్యర్థిపై సమాచారం ఇవ్వనుంది. అయితే ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొనడానికి డికె శివకుమార్, దీప్‌దాస్ మున్షీ, మాణిక్‌రావు ఠాక్రేలతో పాటు పలువురిని ఢిల్లీకి రావాలని అధిష్టానం సూచించడంతో వారం తా ఢిల్లీకి వెళ్లారు.
ఢిల్లీ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా…
సంప్రదాయం ప్రకారం ఇప్పటికే గవర్నర్ తమిళిసైతో సమావేశమైన కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ఏర్పాటుకు ఆ హ్వానించాల్సిందిగా కోరారు. మరోవైపు ప్రమాణ స్వీ కారానికి ఇప్పటికే రాజ్‌భవన్ అధికారులు ఏర్పాట్లు చేశా రు. సుమారు 175 మంది ఆసీనులయ్యే విధంగా ప్రజా దర్బార్ హాల్‌లో ఏర్పాటు చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు ఇ ప్పటికే పేర్కొన్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని రాజ్‌భవన్ సెక్రటేరియట్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖ(జిఎడి)ప్రొటోకాల్ విభాగానికి చేరవేసింది.దీంతోపాటు రా జ్‌భవన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తును పెంచారు.
సరైన అభ్యర్థినే సిఎంగా హైకమాండ్ ప్రకటిస్తుంది: మాణిక్యం ఠాగూర్
ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సమావేశం అనంతరం ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ఓ విధా నం ఉంటుందని, -తెలంగాణ పరిణామాలపై, తెలంగాణ ఎంఎల్‌ఎల అభిప్రాయం ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కు చేరిందని ఆయన తెలిపారు. నేడు మల్లికార్జున ఖర్గే ఎఐసిసి పరిశీలకులతో భేటీ అవుతారని పేర్కొన్నారు. సిఎం అభ్యర్థి ఎవరన్నది ఆయనే ప్రకటిస్తారని, కాంగ్రెస్‌లో ఓ విధానం ఉంటుందని ఆయన తెలిపారు. సరైన అభ్యర్థినే సిఎంగా హైకమాండ్ ప్రకటిస్తుందన్నారు.
పరిశీలకులతో చర్చించాల్సిన అవసరం ఉంది: జైరాం రమేష్
సోనియా నివాసంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమావేశంలో తెలంగాణ సిఎల్‌పి అంశంపై చర్చ జరగలేదని, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్ పేర్కొన్నారు. డికె శివకుమార్, ఇతర పరిశీలకులు ఢిల్లీ వచ్చారని, పరిశీలకులతో చర్చించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. వాళ్ల అభిప్రాయం హైకమాండ్ తీసుకుంటుందని, సిఎల్‌పి ఖరారుపై నేడు నిర్ణయం తీసుకోవచ్చన్నారు.
ఖర్గే, పరిశీలకులతో సోనియా భేటీ
అయితే కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమావేశం అనంతరం సోనియాగాంధీ ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్, ఎఐసిసి పరిశీలకులతో ఢిల్లీలో భేటీ అయినట్టుగా తెలిసింది. తెలంగాణ ఫలితాలతో పాటు సిఎం అభ్యర్థిపై చర్చించినట్టుగా సమాచారం. నేడు డికె శివకుమార్, ఇతర పరిశీలకులతో ఖర్గే చర్చించిన అనంతరం అధిష్ఠానం నిర్ణయాన్ని డికె శివకుమార్ ద్వారా నేడు తెలంగాణ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలకు పంపాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఢిల్లీకి వెళ్లినట్టుగా సమాచారం. వీరితో పాటు మంత్రి పదవిని ఆశిస్తున్న వారు ఢిల్లీకి వెళ్లి తమ వినతిని అధిష్ఠానానికి విన్నవించినట్టుగా తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News