Monday, January 20, 2025

బ్రిడ్జి పైనుంచి నదిలో పడిన బస్సు: 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్ జిల్లాలో బ్రిడ్జి పైనుంచి ప్రైవేటు బస్సు నదిలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 50 మందిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. 70 మంది ప్రయాణికులతో బస్సు ఖర్గోన్ నుంచి ఇండోర్‌కు వెళ్తుండగా బ్రిడ్జి పిట్ట గోడను ఢీకొట్టి నదిలో పడింది. కలెక్టర్ శివరాజ్ సింగ్ వర్మ ఘటనా స్థలానికి చేరుకొని అధికారులు, పోలీసులు, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, చిన్న పాటి గాయాలైన వారికి రూ.25 వేలు ఇస్తామని పేర్కొన్నారు.

Also Read: రాహుల్ స్థానంలో ఇషాన్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News