Monday, January 20, 2025

ఖరీఫ్ పంట సాగు చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి: జిల్లాలో రైతులు విత్తనాలు వెదజల్లే పద్దతి చేసుకుంటే తక్కువ లేబర్‌తో ఎక్కువ పంట ఆదాయం వచ్చే అవకాశముందని ఖరీఫ్ పంట సాగు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఐడిఓసి సమావేశం హాల్‌లో విలేకరులతో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2023 నెలలో వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే 23 శాతం వర్షపాతం తక్కువగా నమోదు అయిందని అన్నారు.

జూలై నెలలో 73.9 మీల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 52.8 శాతం మాత్రమే కురిసిందని , ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల వర్షపాతం లోటు లేదని అన్నారు. గత సంవత్సరంలో 1,75,700 ఎకరాలలో సాగు విస్తీర్ణం జరిగిందని, ఈ సంవత్సరం జూలై నెలలో 28.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలు సాగు చేయాలని, రైతులు జూలై నాటికి 1.75 లక్షల ఎకరాలు రైతులు వివిధ పంటలు సాగు చేశారని, అయితే ఈ సంవత్సరం వర్షాలు ఆలస్యం కావడంతో ఇప్పటి వరకు 83000 ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలు సాగు చేశారన్నారు.

జూలై 31 వరకు అనువైన పంటలు వరి, మొక్కజొన్న, సజ్జలు , రాగి, కొర్ర, కందులు స్వల్ప కాలిక వ్యవధిలో పండే వేరుశనగ, ఆముదం పొద్దు తిరుగుడు, ఎర్రమిరపపంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌తో పాటు వ్యవసాయ అధికారి గోవిందునాయక్, ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా అందరూ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News