Friday, November 22, 2024

గోదావరి బేసిన్‌లో ఖరీఫ్ కళకళ

- Advertisement -
- Advertisement -

రిజర్వాయర్లలో పుష్కలంగా నీటి నిల్వలు

13జిల్లాల్లో 100శాతం పైనే పంటల విస్తీర్ణం
రాష్ట్ర సగటు 93శాతంపైన మరో 4జిల్లాలు

122.80% పంటలతో అగ్రభాగాన మెదక్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గోదావరి బేసిన్ వివిధ రకాల పంటల సాగుతో పచ్చ టి తివాచి పరిచినట్టుగా మారింది. రాష్ట్ర వ్యవసా య రంగానికి సబంధించి ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు లక్ష్యాలకు ఈ సారి ఉత్తర తెలంగాణ ఊపిరిపోసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి కోటి 24లక్షల ఎ కరాల్లో పంటల సాగును లక్షంగా పెట్టుకోగా ఇందులో 93.61శాతం విస్తీర్ణంలో పంటలు సాగులోకి వచ్చాయి. అయితే ఇందులో 13 జిల్లాలు వందశాతం పైగా పంటల సాగుతో కళకళలాడుతుండగా,మరో నాలుగు జిల్లాలు రాష్ట్ర సగటు 93.61శాతం కంటే పైగా విస్తీర్ణంతో ఉన్నాయి. రాష్ట్ర సగటు విస్తీర్ణతకు మించి పంటలు సాగులోకి వచ్చిన ఈ జిల్లాలన్ని ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. అందులోనూ గోదావరి బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల పరిధిలోనే ఉన్నాయి. గోదావరినదీ పరీవాహకంగా కురిసిన భారీ వర్షాలతో ఇ టు భూగర్భజలమట్టాలు పెరగటంతోపాటు ప్రాజెక్టుల్లో కూడా భారీగా నీటినిలువలతో నిండు కుండలను తలపిస్తున్నాయి. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు లోయర్ మానేరు, నిజాంసాగర్ , సింగూరు , కడెం తదితర ప్రాజెక్టులో 198టిఎంసీలకు పైగా నీరు నిలువ ఉంది. అంతే కాకుండా గోదావరి నదిలో నీటి ప్రవాహాలు కూడా కొనసాగుతున్నాయి.. శుక్రవారం శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 5860క్యూసెక్కుల నీరుచేరుతుండగా, ప్రాజెక్టులో నీటి నిలువ 88.11టిఎంసీలు ఉంది.

గత ఏడాది కూడా ఇదే సమయానికి 86.46టిఎంసీల నీరు నిలువ ఉండేది. ఎల్లంపల్లిలో 19.87టిఎంసీల నీరు నిలువ ఉండగా, ఎగువ నుంచి 5608క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. మిడ్ మానేరులో 20.05టిఎంసీలు, లోయర్ మానేరులో 19.91టిఎంసీల నీరు నిలువ ఉంది. నిజాంసాగ్‌లో కూడా 16.42టిఎంసీల నీరు నిలువ ఉంది. గత ఏడాది కూడా ఈ రిజర్వాయర్‌లో ఈ సమయానికి 16.15టిఎంసీల నీరు నిలువ ఉండేది. సింగూరు ప్రాజెక్టులో 27.18 టిఎసీల నీరు నిలువ ఉంది. కడెం ప్రాజెక్టులో 6.69టిఎంసీల నీరు నిలువ ఉంది. ఇటు భూగర్భ జలాలకు కూడా గణనీయంగా వృద్ధి చెందటం, అటు ప్రధాన ప్రాజెక్టుల్లో నీటినిలువలు గరిష్ఠ స్థాయికి చేరువలో ఉండటంతో ఈ సారి ఖరీఫ్ సీజన్‌లో ఆయకట్టుకింద పంటలకు పూర్తి స్థాయిలో పుష్కంలంగా నీటిలభ్యత అందుబాటులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News