Tuesday, December 3, 2024

ఖరీఫ్ విత్తన ప్రణాళిక రెడీ

- Advertisement -
- Advertisement -

1.26కోట్ల ఎకరాల్లో పంటసాగు
అంచనా 16.50లక్షల క్వింటాళ్ల
వరి విత్తనాలు 121లక్షల ప్యాకెట్ల
పత్తి విత్తనాలు రూ.170కోట్లు
విత్తన రాయితీకి ప్రతిపాదన
ఎన్నికల సంఘం అనుమతి
తర్వాతే ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రబీసీజన్ ముగింపు దశకు చేరువ కాకముందే ప్రభు త్వం రానున్న ఖరీఫ్‌లో వివిధ రకాల పంటల సాగు విస్తీర్ణపు అంచనాలు , వాటికి అసరమైన వి త్తనాలు తదితర అంశాలపై కసరత్తులు చేస్తోంది. రైతులు తొలకరి వర్షాలతోనే పత్తి పంట సాగు చేయటం ఆనవాయితీగా వస్తోంది. కొన్ని చోట్ల నీ టిఆధారం ఉన్న ప్రాంతాల్లో మే నెలలోనే పత్తి వి త్తనాలు నాటడం ప్రారంభిసారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విత్తన ప్రణాళికు రూపొందిస్తుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ఉన్నత స్థాయిలో విత్తన సరఫరాపై సమీక్షలు నిర్వహించింది. ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన విత్తన ప్రణాళిక రూపకల్పన తుదిదశకు చేరిందని త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్టు వ్యవసాయశాఖకు చెందిన ఉన్నత స్థాయి అధికారి ఒకరు పేర్కొన్నారు.రాష్ట్రంలో ఆహారధా న్య పంటలు, తృణధాన్య పంటలు , పప్పుదినుసు పంటలు,నూనెగింజ పంటలు , వాణిజ్య పంటలు కలిపి సుమారు 23రకాల పంటలు ఖరీఫ్‌లో సా గులోకి రానున్నాయి.

ఈ సారి కోటి 26లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావచ్చని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే విత్తన ప్రణాళికకు రూపకల్పన చేస్తోంది. ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో ప్రధానంగా వరి , పత్తి పంటలే 80 శాతం పైగా విస్తీర్ణతను ఆక్రమిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ సారి 65లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వస్తుందని అంచనా వేశారు. అదే విధంగా పత్తి సాగు కూడా 60లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టు ప్రాధమికంగా అంచనా వేశారు. ఈ రెండు పంటలే రాష్ట్రంలో కోటి 25 లక్షల ఎకరాలకు చే రే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ప్రధాంగా సాగయ్యే వరి, పత్తి ,మొక్కజొన్న విత్తనాలు రైతుల అవసరాలకు తగ్గట్టుగా అందుబాటులో ఉంచేందుకు విత్తన ప్రణాళికను సిద్దం చేస్తోంది.

రాబోయే వానా కాలం దృష్ట్యా పత్తి విత్తనాలతోపాటుగా , మొక్కజొన్న, ఇతర విత్తనాల సరఫరాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విత్తన కంపెనీలను అప్రమత్తం చేస్తున్నారు. . రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వివిధ పంటల సాగు వివరాలు, విత్తన లభ్యతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే వివిధ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులతో సమీక్షించారు. రాష్ట్రంలో వరిపంట తర్వాత పత్తి రెండవ ప్రధాన పంటగా సాగులోకి వస్తోంది. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో కూడా దాదాపు 60 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు కావచ్చని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందుకోసం 121.06 లక్షల ప్యాకేట్లు అవసరం ఉంది. దానికి తగ్గట్లు అన్ని ప్రైవేట్ విత్తన కంపెనీలు వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం పత్తి విత్తనాలు సరఫరాకు ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.

ఇతర ప్రధాన పంటల్లో వరి 16.50లక్షల క్విం టాళ్లు, మొక్కజొన్న 48వేల క్వింటాళ్లు అవసరమవుతాయని అంచనా వేశారు. రాష్ట్ర అవసరాలకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలని విత్తన కంపెనీలకు ఖచ్చితమైన ఆదేశాలిచ్చారు. విత్తన సరఫరాలో పారదర్శకత, నాణ్యమైన విత్తన సరఫరా కోసం విత్తన కంపెనీ ప్రతినిధులు సూచించిన కొన్ని అంశాలను కూడా పరిశీలన చేస్తునారు. ఆయా కంపెనీల విత్తన ఉత్పత్తి వివరాలు, రాష్ట్రానికి సరఫరా చేసే విత్తనాల వివరాలు, గత సంవత్సరం ఖరీఫ్ సీజన్‌లో సరఫరా చేసిన విత్తనాల పరిమాణం తదితర అంశాలను సమీక్షించారు. రైతాంగం ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల విత్తనాల సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విత్తన ఉత్పత్తి కంపెనీలు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించేలా చర్యలు తీసుకుంటున్నారు.

రూ.170కోట్ల సబ్సిడీపై త్వరలో నిర్ణయం
వ్యవసాయరంగంలో ప్రభుత్వం రైతులకు మరింత అండగా నిలవాలన్న అభిప్రాయంతో ఉంది. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచటంతోపాటు విత్తన సబ్సిడిని కూడా అందజేయాలన్న అభిప్రాయంతో ఉంది. ఇందుకు సంబంధించి వ్యవసాయశాఖ విత్తన సబ్సిడిపై ప్రతిపాదించిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. వరి, మొక్కజొన్న, సోయాబిన్, మినుము, కంది, పెసర , జీలుగ, తదితర విత్తనాలపై సబ్సిడి అందజేయాలని నివేదికలో ప్రతిపాదించింది.

విత్తన రకాన్ని బట్టి 35నుంచి 65శాతం వరకూ సబ్సిడి అందించే అవకాశాలు ఉన్నాయి. విత్తన సబ్సిడికింద సుమారు రూ.170కోట్లు అవసరం అని అంచాన వేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ్రప్రాయోజిక పథకాల ద్వారా రూ.25కోట్లు అందే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం విత్తన సబ్సిడిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల సంఘం అనుమతి పొందాకే విత్తన సబ్సిడిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనుందని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News