మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్లో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడీ’ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా మూడవ పాట ‘అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే.. ఒంట్లో వేడికే పిచ్చెక్కుతాంది నాడికే’ను విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్‌కు ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు సింగర్ సమీరా భరద్వాజ్‌తో కలిసి స్వయంగా ఆలపించారు. దీనికి లిరిసిస్ట్ శ్రీమణి మాస్ ఆడియన్స్‌కి నచ్చేలా సాహిత్యాన్ని అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రవితేజ, మీనాక్షి చౌదరీ ఈ పాటలో ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ‘ఖిలాడీ’ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలోకి రానుంది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.