Monday, December 23, 2024

అబుదాబీ నైట్‌ రైడర్స్‌ కోసం ఎక్స్‌ ఫ్యాక్టర్‌ను జోడించిన ఖిలాడిక్స్‌ డాట్‌ కామ్‌..

- Advertisement -
- Advertisement -

స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ ఖిలాడిక్స్‌ డాట్‌ కామ్‌ తాము అబుదాబీ నైట్‌ రైడర్స్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా యుఏఈలో జరుగనున్న డీపీడబ్ల్యు ఐఎల్‌ టీ20 పోటీలకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా అబుదాబీ నైట్‌ రైడర్ల టీమ్‌ ప్లేయర్లందరి జెర్సీలను ఖిలాడిక్స్‌ డాట్‌ కామ్‌ బ్రాండింగ్‌తో రూపొందించనుంది. అబుదాబీ నైట్‌ రైడర్ల ఈ భాగస్వామ్యంతో ఖిలాడిక్స్‌ డాట్‌ కామ్‌ బ్రాండ్‌ పట్ల మరింతగా అవగాహన మెరుగుపడనుంది.

ప్రీమియం స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌గా ఖిలాడిక్స్‌ డాట్‌ కామ్‌ ఇప్పుడు క్రీడలకు సంబంధించి ఏకీకృత వేదికగా నిలువాలని లక్ష్యంగా చేసుకుంది. అబుదాబీ నైట్‌ రైడర్స్‌తో భాగస్వామ్యంతో ఖిలాడిక్స్‌ డాట్‌ కామ్‌కు మరింత ప్రాచుర్యం లభించనుంది. జెర్సీ బ్రాండింగ్‌ మాత్రమే కాకుండా బ్రాండింగ్‌ అవకాశాలు కలిగిన ప్రతి చోటా సంస్ధ లోగో ప్రదర్శిస్తారు. ఈ భాగస్వామ్యంతో అంతర్జాతీయంగా క్రికెట్‌ లీగ్‌తో ఖిలాడిక్స్‌ డాట్‌ కామ్‌ భాగస్వామ్యం ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ఖిలాడిక్స్‌ డాట్‌ కామ్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ‘‘ అబుదాబీ నైట్‌ రైడర్స్‌తో మా తొలి భాగస్వామ్యం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఈ భాగస్వామ్యం మా లక్ష్యిత గ్రూప్‌కు చేరుకోవడంలో మాకు సహాయపడటంతో పాటుగా వారితో చురుగ్గా అనుసంధానించబడేందుకు సైతం తోడ్పడుతుంది. మా భాగస్వామి అబుదాబీ నైట్‌ రైడర్స్‌తో కలిసి మా బ్రాండ్‌ ప్రతిపాదనను బలోపేతం చేసేందుకు యుఏఈలో మొట్టమొదటిసారిగా జరుగనున్న అంతర్జాతీయ టీ20 పోటీల పట్ల మేము ఆసక్తిగా ఉన్నాము’’ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News