Monday, December 23, 2024

నా తండ్రి లైంగికంగా వేధించాడు:ఖుష్బూ

- Advertisement -
- Advertisement -

జైపూర్: సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లూ) సభ్యురాలు ఖుష్భూ తన తండ్రిపై సంచలన ఆరోపణలు చేశారు. ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రి లైంగికంగా వేధించాడని సుందర్ వెల్లడించారు. తన జీవితంలో అది దుర్భర పరిస్థితిగా ఆమె అభివర్ణించారు. అత్యంత కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను అని 15ఏళ్ల వయస్సులో తండ్రిపై తిరుగుబాటు మొదలుపెట్టినట్లు తెలిపారు. అనంతరం తమ తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడని వివరించారు. జైపూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

చిన్ననాటి కఠిన పరిస్థితులు, లైంగిక వేధింపులను మరిచిపోలేకపోయాను, క్షమించలేకపోయాను, మనోవేదనను తనలోనే దాచుకుని ముందుకువెళ్లినట్లు జైపూర్‌లో నిర్వహించిన ‘వి ది ఉమెన్’ కార్యక్రమంలో తెలిపారు. తండ్రి నుంచే లైంగిక వేధింపులు ఎదుర్కొన్న బాలికకు జీవితాంతం ఆ కళంకం వెంటాడుతుందని ఆమె తెలిపారు. భార్య, పిల్లలను కొట్టడం, లైంగికంగా వేధించడం తన జన్మహక్కు అని తండ్రి భావించాడన్నారు.

ఎనిమిదేళ్ల వయస్సులోనే వేధింపులు ఎదుర్కొన్న తను పదిహేనేళ్ల వయస్సులో ధైర్యంగా ఎదిరించడంతో తమను ఒంటరిగా వదిలేసి తండ్రి వెళ్లిపోయాడని ఖుష్బూ తెలిపారు. తన తండ్రిని ఎదిరించినందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తమ తండ్రి కుటుంబంతో ఉండుంటే ఇంతదూరం వచ్చేదాన్ని కాదని ఖుష్బూ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News