Thursday, January 23, 2025

రేపే ‘ఖుషి’ ఫోర్త్ సింగిల్ ‘యెదకే ఒక గాయం..’

- Advertisement -
- Advertisement -

విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’ .  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

రిలీజ్ డేట్ దగ్గరకు వస్తుండటంతో సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. రీసెంట్ గా నిర్వహించిన మ్యూజిక్ కన్సర్ట్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ కన్సర్ట్ లో పాల్గొన్న ఆడియెన్స్ కోసం ఎక్స్ క్లూజివ్ గా ‘ఖుషి’ నాలుగో పాటను వినిపించారు. యెదకు ఒక గాయం అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ ను రేపు సాయంత్రం 6.03 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. సినిమాలో లవ్ పెయిన్ తెలిపే ఎమోషనల్ పాటగా దీన్ని చిత్రీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News