అతిలోక సుందరి శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలు అన్ని ఆమె ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో పంచుకుంటుంది. అయితే తాజాగా తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వెల్లడించింది ఈ బ్యూటీ. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెక్లెస్ ధరించి ఫోటోలు షేర్ చేసింది. అందులోనే అసలు ట్విస్ట్ ఉంది. ఆ నెక్లెస్‌లో వి లవ్ కె అనే అక్షరాలు ఉన్నాయి.
2023లో విడుదలైన ‘ది ఆర్చిస్’తో ఖుషీ తెరంగేట్రం చేసింది. ఇందులో ఆమెతో పాటు నటించిన హీరో పేరే వేదాంగ్ రైనా. ఆ సినిమా షూటింగ్‌లో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. అంతేకాదు.. ఆలియా భట్ ప్రధాన పాత్రలో వేదాంగ్ నటించిన జిగ్రా సినిమా విడుదల సమయంలోనూ ఖుషీ అతన్ని ప్రోత్సాహిస్తూ పోస్ట్ చేసింది. ఇప్పుడు వాళ్ల రిలేషన్‌షిప్‌ని ధృవీకరిస్తూ.. ఆమె ఆ లాకెట్ ఉన్న నెక్లెస్‌ని ధరించి ఫోటోని పోస్ట్ చేసింది.
అయితే ఇలా లాకెట్ ధరించి రిలేషన్‌షిప్ గురించి చెప్పడం ఖుషీ తన సోదరి జాన్వీ నుంచి నేర్చుకుంది. జాన్వీ కూడా తను శిఖర్ పహాడియాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఇలానే లాకెట్ వేసుకొని కన్ఫామ్ చేసింది. మైదాన్ అనే సినిమా ప్రీమియర్స్‌కి ఆమె ‘శిఖు’ అని రాసి ఉన్న లాకెట్‌ను ధరించి వచ్చింది.