Monday, December 23, 2024

శ్రీదేవి డ్రెస్సులో అదరగొట్టిన కూతురు ఖుషీ

- Advertisement -
- Advertisement -

పరిచయం అక్కర్లేని నటి శ్రీదేవి. ఎనభై, తొంభై దశకాల్లో తన అందచందాలతో యువతకు గిలిగింతలు పెట్టిన నటి ఆమె. నటనలోనూ తక్కువేం కాదు. పదహారేళ్ళ వయసు, సద్మా, దేవత, హమ్మత్ వాలా వంటి సినిమాలతో తానేంటో నిరూపించుకుంది. ఆమె దూరమై ఐదేళ్లు గడుస్తున్నా అభిమానులెవరూ ఆమెను మరచిపోలేదు. ఆమె వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కూడా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తోంది. ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ, ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసేందుకు కృషి చేస్తోంది. జాన్వీ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది.

ఇక జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ ఈమధ్యనే సినీరంగ ప్రవేశం చేసింది. ‘ది ఆర్చీస్’ అనే సినిమాతో ఆమె బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ముంబైలోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్లో జరిగిన ఈ సినిమా ప్రీమియర్ షోలో ఖుషీ.. ఒకప్పుడు తన తల్లి శ్రీదేవి ధరించిన స్ట్రాప్ లెస్ గౌనునే ధరించి, అందరినీ ఔరా అనిపించింది. స్ఫటికాలతో కూడిన ఈ డ్రెస్సును శ్రీదేవి ధరించి 2013లో ఐఐఎఫ్ఏ రెడ్ కార్పెట్ పై నడిచింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News