విజేతగా బ్రిటన్ బయోమెడికల్ విద్యార్థిని
వాషింగ్టన్: మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ 2022 కిరీటాన్ని బ్రిటన్‌కు చెందిన బయోమెడికల్ విద్యార్థిని ఖుషి పటేల్ దక్కించుకున్నారు. భారతదేశం వెలుపల గత 29 ఏళ్లుగా ప్రపంచవ్యాప్త భారతీయ అందాల సుందరి పోటీలను ఇండియా ఫెస్టివల్ కమిటీ(ఐఎఫ్‌సి) నిర్వహిస్తోంది. శుక్రవారం రాత్రి జరిగిన ప్రపంచవ్యాప్త భారతీయ అందాల సుందరి పోటీలో ఫస్ట్ రన్నర్ అప్‌గా అమెరికాకు చెందిన వైదేహి డోంగ్రే ఎంపిక కాగా సెకండ్ రన్నర్ అప్‌గా శృతికా మానే ఎంపికయ్యారు. ఈ అందాల సుందరి పోటీలో పాల్గొన్న 12 మంది సుందరీమణులు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వేర్వేరు అందాల పోటీలలో విజేతలుగా నిలిచినవారే. కాగా..గుయానాకు చెందిన రోషనీ రజాక్ మిస్ టీన్ ఇండియా వరల్డ్‌వైడ్ 2022 విజేతగా నిలిచారు. అమెరికాకు చెందిన నవ్యా పైంగల్ ఫస్ట్ రన్నర్ అప్‌గా, సురినాంకు చెదిన చిఖితా మలాహ సెకండ్ రన్నర్ అప్‌గా గెలుపొందారు. చివరిగా 2019లో ముంబయిలోని లీలా హోటల్‌లో ఈ పోటీలు జరిగాయి. కరోనా కారణంగా మూడేళ్ల విరామం అనంతరం ఈ పోటీలను ఈ ఏడాది నిర్వహించినట్లు ఐఎఫ్‌సి చైర్మన్ ధర్మాత్మ శరన్ తెలిపారు.