Sunday, November 24, 2024

నెలవారీ లీజుకు కియా కార్లు

- Advertisement -
- Advertisement -

దేశంలోని ప్రధాన నగరాల్లో నెలవారీ లీజుకు తమ బ్రాండ్ కార్లను అందించేందుకు కియా ఇండియా సంస్థ ముందుకు వచ్చింది. ‘కియా లీజ్’ పేరిట సరికొత్త కార్యక్రమానికి సంస్థ శ్రీకారం చుట్టింది. ఇందు కోసం ఓరిక్స్ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్ అనే కంపెనీతో కియా అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదుర్చుకున్నది. కియా సంస్థ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. తొలి దశలో భాగంగా హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణె నగరాల్లో లీజుకు కియా కార్లు అందుబాటులో ఉండనున్నాయి.

లీజు కాలం పూర్తి అయిన తరువాత వాహనాన్ని తిరిగి ఇచ్చేయవచ్చు. అవసరం, ప్రాధాన్యం బట్లి మరొక కొత్త మోడల్ కారును మళ్లీ లీజుకు తీసుకోవచ్చు. కారు నెలవారీ మెయింటెనెన్స్, బీమా ఖర్చులను సంస్థే చూసుకుంటుంది. ‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లీజింగ్ మోడల్ ట్రెండింగ్‌లో ఉంది. దేశంలోనే ఇప్పుడిప్పుడే దీనికి ఆదరణ లభిస్తోంది. అందుకే ‘కియా లీజ్’ను తీసుకువచ్చాం. అందుబాటు ధరల్లో కార్లను లీజుకు ఇవ్వనున్నాం. దీని వల్ల మా కస్టమర్లు మున్ముందు ఇంకా పెరుగుతారు’ అని కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ మైయుంగ్ సిక్ సోన్ తెలిపారు.

కారు నెలవారీ లీజు ఇలా:
కియా సోనెట్ రూ. 21900.
కారెన్స్ రూ. 28800.
సెల్టోస్ రూ. 28900.
24 నెలల నుంచి 60 నెలల కాలానికి ఈ కార్లను లీజుకు తీసుకోవచ్చు.
ఇందు కోసం ఎటువంటి డౌన్ పేమెంట్లూ చెల్లించవలసిన అవసరం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News