Sunday, December 22, 2024

ఆ సాహసం వల్లే స్టార్‌గా..

- Advertisement -
- Advertisement -

Kiara Advani about bold scene in Lust Stories

ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు వదిలి పెట్టిన కథలు, సినిమాలు చిన్న హీరోలు, హీరోయిన్ల వద్దకు వెళ్లి వారికి మంచి విజయాలను తెచ్చి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అదే సంఘటనను కియారా అద్వానీ కాఫీ విత్ కరణ్ టాక్ షోలో చెప్పుకొచ్చింది. చిన్న సినిమాల్లో నటిస్తూ గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్న కియారా అద్వానీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ‘లస్ట్ స్టోరీస్’తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఆ వెబ్ సిరీస్‌లో వైబ్రేటర్‌ను ఉపయోగించే ఒక బోల్డ్ సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశంలో కియారా అద్వానీ అద్భుతంగా నటించడం వల్లే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో స్టార్ అయింది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని కియారా అద్వానీ కూడా ఒప్పుకుంది. తాజాగా కరణ్ జోహార్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో కియారా ఆ విషయం గురించి మాట్లాడింది. మొదట ఆ పాత్రను బాలీవుడ్ లో అప్పటికే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న కృతి సనన్ వద్దకు వెళ్లిందట. ఆమె తల్లి అలాంటి పాత్రల పట్ల వ్యతిరేకత కనబర్చడంతో కృతి అలాంటి పాత్రను చేయలేను అంటూ తిరస్కరించింది. కృతి సనన్ ఆ పాత్రను తిరస్కరించడంతో కరణ్ జోహార్ అప్పటికే కాస్త గుర్తింపు ఉన్న కియారా అద్వానీని కలిశాడు. ఆ సన్నివేశాన్ని, పాత్ర తీరును చెప్పగానే కియారా చేసేందుకు ఓకే చెప్పిందట. ఒక వెబ్ సిరీస్‌లో అలాంటి పాత్రను చేయడం చాలా పెద్ద సాహసం. అలాంటి పాత్రను చేసినందుకు గాను కియారా అద్వానీ లక్కీ అని చెప్పుకోవాలి. ఆ పాత్ర వల్లే ప్రస్తుతం ఆమె కెరీర్ ఈ స్థాయిలో ఉంది. అందుకే కొన్ని సార్లు సాహసం చేయాలి. అప్పుడే కెరీర్‌లో స్టార్‌గా నిలిచే అవకాశాలు ఉంటాయి.

Kiara Advani about bold scene in Lust Stories

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News