ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 వేడుకలో వివిధ దేశాలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. పలువురు భారతీయ నటీనటులు ఈ అంతర్జాతీయ వేదికపై తమదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. గేమ్ ఛేంజర్ సినిమా హీరోయిన్ కియారా అద్వానీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికైనట్లు తెలిసింది. ఆమె కేన్స్‌లో వానిటీ ఫెయిర్ హోస్ట్ చేస్తున్న రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ యొక్క ఉమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్‌కు హాజరు కానుంది. రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యానెల్‌లో కియారా అద్వానీ, సల్మా అబు దీఫ్, సరోచా చంకిమ్హా, అధ్వా ఫహద్, అసీల్ ఒమ్రాన్, రమతా టౌలే సైతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరుగురు ప్రతిభావంతులైన మహిళలు ఈ ఈవెంట్‌లో పాల్గొంటారు. ఇక అందాల తారలు కియారా అద్వానీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, శోభితా ధూళిపాళ, అదితి రావ్ హైదరీ రెడ్ కార్పెట్‌పై సందడి చేయనున్నారు.