Sunday, December 22, 2024

రెండు తెలుగు సినిమాలను తిరస్కరించిన కియారా

- Advertisement -
- Advertisement -

Kiara Advani rejects two telugu films

అందాల తార కియరా అద్వానీ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరు. తెలుగులో కూడా వెరీ పాపులర్. ఇప్పటికే వినయ విధేయ రామ, భరత్ అనే నేను సినిమాల్లో నటించి ప్రస్తుతం రామ్‌చరణ్ సరసన శంకర్ డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగు సినిమాకి నాలుగు కోట్లు తీసుకునే ఈ భామకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. త్వరలో మొదలు కావాల్సిన రెండు పెద్ద సినిమాల్లో ఈ భామని అడిగారు. కానీ, డేట్స్ లేవని చెప్పి తిరస్కరించింది. నిజంగానే ఆమెకి కాల్షీట్ల సమస్య ఉంది. రామ్‌చరణ్, శంకర్ సినిమా ఆగుతూ ఆగుతూ నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ని పక్కన పెట్టి ‘భారతీయుడు 2’ తీస్తున్నాడు శంకర్. అటు ‘భారతీయుడు 2’, ఇటు రామ్‌చరణ్ సినిమా చేస్తూ కియారా డేట్స్ మొత్తం లాక్ చేశారు శంకర్. పైగా ఆమె చేస్తున్న బాలీవుడ్ చిత్రాలు కూడా పెద్దవే. వాటికి డేట్స్ ఇచ్చుకుంటూ, ఇటు శంకర్ సినిమాకి నెలల కొద్దీ డేట్స్ ఇస్తూ షూటింగ్స్ చేస్తోంది. అందుకే రెండు తెలుగు పెద్ద సినిమాలను ఇప్పుడు చేయలేనని చెప్పి తిరస్కరించింది. వచ్చే ఏడాది మార్చి వరకు కష్టమే అని చెప్పింది. అందుకే ఆమె చేయాల్సిన సినిమాలు ఇతరులకు వెళ్తున్నాయి.

Kiara Advani rejects two telugu films

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News