Wednesday, January 22, 2025

కేజీఎఫ్ స్టార్ యశ్ కు జోడీగా కియారా?

- Advertisement -
- Advertisement -

కన్నడ స్టార్ హీరో యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నారు. దేశవ్యాప్తగంగా సంచలన విజయం సాధించిని కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో యశ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, ‘టాక్సిక్’ మూకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈమూవీని కేవీఎన్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో ఓ కీలక పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార కనిపించనున్నారట. కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News