Thursday, January 9, 2025

నిర్మాతలకు కిచ్చా సుదీప్ లీగల్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న కన్నడ నటుడు కిచ్చా సుదీప్ చిత్ర నిర్మాతలు కుమార్, సురేష్‌కు రూ. 10 కోట్ల రూపాలయ నష్టపరిహారం కోరుతూ పరువునష్టం నోటీసులు పంపించారు. తన న్యాయవాదులు సివి నగేష్ అసోసియేట్స్ ద్వారా సుదీప్ నిర్మాతలకు నోటీసులు పంపారు.

నిర్మాత కుమార్ నిర్మించిన రంగా ఎస్‌ఎస్‌ఎల్‌సి, కాశీ ఫ్రం విలేజ్, ముకుంద మురారి, మాణిక్య అనే నాలుగు చిత్రాలలో కిచ్చా సుదీప్ నటించారు. జులై 3వ తేదీన బెంగళూరులోని కర్నాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుమార్ మాట్లాడుతూ తాము నిర్మిస్తున్న ఒక చిత్రంలో నటించడానికి కిచ్చా సుదీప్‌కు అడ్వాన్స్ ఇచ్చామని, ఆ తర్వాత ఒప్పుకున్న మొత్తానికి డబ్బు మొత్తం చెల్లించామని తెలిపారు. సుదీప్ సిఫార్సుతో ఇతర నటుడలకు కూడా తాము అడ్వాన్స్ ఇచ్చామని ఆయన చెప్పారు. బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌లో ఒక నివాస గృహం కొనుగోలు చేసేందుకు సుదీప్‌కోసం అడ్వాన్సు డబ్బు తామే చెల్లించామని కూడా నిర్మాత కుమార్ తెలిపారు. ఈ ఇంటర్వూకు సంబంధించిన వీడియో సమామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది.

ఈ ఇంటర్వూతో తన ప్రతిష్ట దెబ్బతిందని, అందుకు పరిహారంగా రూ. 10 కోట్లు తనకు చెల్లించాలని నిర్మాతలు కుమార్, సురేష్‌లకు కిచ్చా సుదీప్ తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపారు. కాగా,,దీనిపై వ్యాఖ్యానించడానికి కుమార్ అందుబాటులోకి రాలేదు.

కాగా..సురేష్ మాత్రం మాట్లాడుతూ తాను కర్నాటక చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శిగా నిర్మాత కుమార్‌కు మద్దతుగా ఆ విలేకరుల సమావేశంలో పాల్గొన్నానని వివరణ ఇచ్చారు. తాను ఎటువంటి ఆరోపణలు చేయలేదని, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని మాత్రమే తాను కోరుకుటున్నానని సురేష్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News