Thursday, January 23, 2025

పావిక్ జోడికి మిక్స్‌డ్ టైటిల్

- Advertisement -
- Advertisement -

లండన్: వింబుల్డన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఏడో సీడ్ మెట్ పావిక్ (క్రొయేషియా)కిచేనొక్ (ఉక్రెయిన్) జోడీ టైటిల్‌ను సాధించింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో పావిక్ జంట 64, 67, 63 తేడాతో జు ఇఫాన్ (చైనా) జొరాన్ విజెన్ (బెల్జియం) జోడీని ఓడించింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు పావిక్ అటు ఇఫాన్ జంట హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో పోరులో ఉత్కంఠత తప్పలేదు.

అయితే నిలకడగా ఆడిన పావిక్ జంట తొలి సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కానీ రెండో సెట్‌లో ప్రత్యర్థి జంట ఆధిపత్యం చెలాయించింది. పావిక్ జోడీని కంగుతినిపిస్తూ టైబ్రేకర్‌లో సెట్‌ను దక్కించుకుంది. అయితే ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో మాత్రం మళ్లీ పావిక్ జంట జోరును కొనసాగించింది. అలవోకగా సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News