Monday, January 20, 2025

మణిపూర్‌లో అంబులెన్స్‌కు నిప్పు.. 8ఏళ్ల బాలుడు, తల్లి మృతి

- Advertisement -
- Advertisement -

మణిపూర్: మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది. తుపాకీ కాల్పుల్లో గాయపడిన ఎనిమిదేళ్ల బాలుడ్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో ఆ బాలుడితోపాటు అతని తల్లి, బంధువైన మరో వ్యక్తి సజీవ దహనం అయ్యారు. పశ్చిమ ఇంఫాల్ ఇరోయిసెంటా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. మృతుడు ఎనిమిదేళ్ల బాలుడు టాన్సింగ్ హాంగ్‌సింగ్, తల్లి మీనా హాంగ్‌సింగ్, వారి బంధువు లిడియా లౌరెంబెమ్‌గా పోలీస్‌లు గుర్తించారు. ఈ కుటుంబంలో తల్లి మెయిటీ తెగకు చెందగా, తండ్రి కుకీ వర్గానికి చెందినవాడు. వీరంతా కాంగ్‌చప్ లోని అస్సాం రైఫిల్స్ శిబిరంలో ఉంటుండగా ఈ సంఘటన జరిగింది. ఈ శిబిరం చుట్టూ భద్రతను మరింత పటిష్టం చేశామని అస్సాం రైఫిల్స్ ఆఫీసర్ చెప్పారు.

ఆదివారం సాయంత్రం ఈ శిబిరం వద్ద తుపాకీ కాల్పులు జరిగాయి. ఎనిమిదేళ్ల బాలుడు తలకు తీవ్రంగా గాయమైంది. గాయపడిన బాలుడ్ని ఇంఫాల్ ఆస్పత్రికి తరలించడానికి అస్సాం రైఫిల్స్‌ఆఫీసర్ ఏర్పాట్లు చేశారు. ఆ ప్రకారం కొంతదూరం వరకు అస్సాం రైఫిల్స్ అంబులెన్స్‌కు ఎస్కార్ట్ ఉన్నారు. ఆ తరువాత స్థానిక పోలీస్‌లు ఎస్కార్ట్ బాధ్యత తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం కుకీగ్రామాలున్న ఇరోయిసెంటా ప్రాంతానికి అంబులెన్స్ చేరగానే ఆందోళనకారులు నిప్పు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News