Thursday, January 23, 2025

వేములవాడలో ట్రాక్టర్ భీభత్సం.. ఆరేళ్ల చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

Kid dies after tractor overturns in Vemulawada

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం మండలంలోని మారుపాకలో ఆరేళ్ల చిన్నారిపైకి ట్రాక్టర్ దూసుకుపోయింది. దీంతో చిన్నారి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. మైనర్ బాలుడు అతివేగంగా ట్రాక్టర్ నడపడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

Kid dies after tractor overturns in Vemulawada

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News