Tuesday, December 24, 2024

అర్థరాత్రి జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం.. రెండున్నరేళ్ల బాబు మృతి

- Advertisement -
- Advertisement -

Kid Dies in Car Accident in Jubilee Hills

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి రోడ్డు దాటుతున్న మహిళని తాకింది. దీంతో ఆమె చేతిలో నుంచి రెండున్నరేళ్ల బాబు కిందపడిపోయాడు. తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి అక్కడి నుంచి కారును వదిలిపెట్టి పారిపోయాడని స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారుని బోధన్ ఎమ్మెల్యే షకీల్‌దని గుర్తించారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Kid Dies in Car Accident in Jubilee Hills

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News