న్యూస్‌డెస్క్: ఆకలి రుచి ఎరగదు..నిద్ర సుఖమెరగదు అని నానుడి.. అలాగే ఎండ, వాన, చలి కూడా తేడా లేకుండా అందరికీ ఒకే అనుభూతిని ఇస్తాయి. ఇది చలికాలం కాబట్టి..చలి ఎవరికైనా చలే అని భావించక తప్పదు. చలి పంజాను మనుషులైనా, జంతువులైనా అనుభవించక తప్పదు. అయితే..తన పెంపుడు మేకపిల్లను చలి నుంచి కాపాడేందుకు ఒక పసివాడు చేసిన ప్రయత్నం పలువురు నెటిజన్ల హృదయాలను దోచుకుంది. చలికి అందరూ బాధితులే అంటూ గుల్జార్ సాహెబ్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియో వీక్షించిన నెటిజన్లు ఆ పిల్లవాడి దయాగుణానికి ముగ్ధులవుతున్నారు. చలి మంట వద్ద కూర్చున్న ఆ పిల్లవాడు మేకపిల్లకు కూడా వెచ్చదనాన్ని పంచడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియోలో వైరల్ అవుతున్న ఈవీడియోను మీరూ చూసెయ్యండి.
ठंड सबको लगती है 🥺❤️ pic.twitter.com/2mwYSWJwVh
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 4, 2022