Saturday, January 18, 2025

వాడి వయసు మూడేళ్లే.. కానీ బ్యాటింగ్ లో దబిడి దిబిడే! (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

దూకుడుగా బ్యాటింగ్ చేయడం గొప్పేమీ కాదు. బ్యాటింగ్ కు టెక్నిక్ కూడా తోడైతే ఆ బ్యాటర్ కు తిరుగుండదు. అలాంటి టెక్నిక్ తో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న ఓ మూడేళ్ళ బుడతడి వీడియో నెట్లో వైరల్ అవుతోంది. వాడి బ్యాటింగ్ తీరు చూసిన అభిమానులంతా వీడు పెద్దయ్యాక మరో కోహ్లీ కావడం ఖాయం అని జోస్యం చెప్పేస్తున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన ఆ బుడ్డోడి పేరు హ్యూగో హీత్. ఆడుతున్నది టెన్నిస్ బాల్ తోనే అయినా, వాడు షాట్లు కొట్టే తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా ఎంతో అనుభవమున్న బ్యాటర్ లా వాడి ఫోజులూ, వాడూనూ! 50 పరుగులు చేశాక, టోపీ తీసి, అభివందనం చేసిన తీరు చూస్తే ‘హారి పిడుగా!’ అనిపించకమానదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News