Wednesday, January 22, 2025

కిడ్నాపైన చిన్నారి క్షేమం

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్: నిన్న రాత్రి కిడ్నాప్‌కు గురైన నాలుగు సంవత్సరాల చిన్నారి కృషివేణిని ప్రత్యేక పోలీసు బలగాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కిడ్నాపర్ సురేష్‌ను అదుపులోకి తీసుకొని రాచకొండ కమిషనర్ డిఎస్. చౌహన్ ఆధ్వర్యంలో గురువారం చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈడబ్లుఎస్ కాలనీలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న భరత్, రాజేశ్వరిల కుమార్తె చిన్నారి కృష్ణవేణిని సురేష్ అనే యువకుడు బుధవారం రాత్రి కిడ్నాప్ చేసి నగరానికి తీసుకవెళ్లగా ప్రత్యేక పోలీసు బలగాలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గురువారం మధ్నాహ్నం అదుపులోకి తీసుకుని ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.

అక్కడి నుండి ఈడబ్లుఎస్ కాలనీలోని తల్లిదండ్రుల నివాసానికి చేరుకున్న కమిషనర్ డిఎస్. చౌహన్, మల్కాజిగిరి డిసిపి జానకి, ఏసిపి నరేష్ రెడ్డి, సిఐ మహేందర్‌రెడ్డిలు నేరుగా చిన్నారిని తల్లిదండ్రులు వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చాక్లెట్ల కొనుగోలుకు బయటకు వచ్చిన చిన్నారిని సమీపంలో ఉంటున్న సురేష్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని, ఫిర్యాదు అందిన మెంటనే ప్రత్యేక పోలీసు బలగాలు 24 గంటలలోపు కిడ్నాపర్‌ను పట్టుకోవడం పట్ల సంబంధిత పోలీసు అధికారులను అభినందించారు. నేరాలు జరిగిన 24 గంటల్లో రాచకొండ కమిషనరేట్ పోలీసు టీం నేరస్తులను పట్టుకునే విధంగా కృషి చేస్తుందని కమిషనర్ డిఎస్ చౌహన్ తెలిపారు.

యువకుల సహకారంతో త్వరగా కిడ్నాపర్ సురేష్‌ను పట్టుకోగలిగామని, నేరాల అదుపునకు యువకుల సహకారం ఎప్పుడు ఉండాలని అన్నారు. మహిళల భద్రతకు సంబంధించిన ఏ కేసు ఉన్న సీరియస్‌గా తీసుకుంటున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News