ఆందోళన వ్యక్తం చేస్తున్న నగర డాక్టర్లు
హైదరాబాద్: నేడు జీవన వైవిధ్యం మారుతున్న నేపథ్యంలో అనేక మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ స్థితిలో యువతలో పెరగుతున్న కిడ్నీ ఫెయిల్యూర్స్ ఆందోళకరంగా ఉన్నాయని హైదరాబాద్‌లోని నెఫ్రాలజిస్టులు పేర్కొంటున్నారు. వారిలో కొందరైతే 22 ఏళ్లకే దీని బారిన పడుతున్నారు. థ్రోంబోటిక్ మైక్రోయాంజియోపథి(టిఎంఎ), తీవ్ర హైపర్ టెన్షన్ వంటివి పనిచేసే వయస్సులోని వారిని(20 నుంచి 40ఏళ్లు) తాకుతోంది. దీంతో వీరిలో చాలా మంది డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందని డాక్టర్లు చెప్పుతున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్స్ ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్నాయని నిమ్స్ డాక్టర్లు చెబుతున్నారు.
‘ గత 8 నుంచి 10 నెలల కాలంలో కిడ్నీ ఫెయిల్యూర్స్ కేసులు బాగా పెరిగాయి. ఇలాంటి ఇదివరలో వృద్ధ రోగుల్లో మేము ఎక్కువ చూసేవాళ్లం. కానీ నేడు యువతలో కూడా బాగా పెరిగిపోవడం చూస్తున్నాం. దేశవ్యాప్తం నుంచి మాకు బయోప్సి రిపోర్టులు కుప్పతెప్పలుగా వచ్చి పడుతున్నాయి’ అని హైదారబాద్‌లోని నిమ్స్ నెఫ్రాలజీ విభాగం అధిపతి, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు తెలిపారు. ‘కరోనా మహమ్మారి కాలంలో హైపర్‌టెన్షన్, డయబెటీస్ తీవ్రం కావడం కూడా దీనికి కారణం అయి ఉండవచ్చు. ఇది థ్రోంబోటిక్ మైక్రోయాంజియోపథి అనే ప్రత్యేక రకం. గత ఏడాది మన చూసిన బ్లాక్ ఫంగస్ కేసుల వలే ఇవి ఉన్నాయి’ అని కూడా ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి రోజూ 250 మంది కిడ్నీ రోగులు వస్తున్నారు. అన్ని ఇతర ఆసుపత్రుల కన్నా ఎక్కువ వస్తున్నారు. ఇక హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కూడా యువత తాలూకు ఈ కిడ్నీ వ్యాధి కేసులు పెరగుతున్నాయి. సీవియర్ హైపర్‌టెన్షన్‌ను చెకప్ చేయించుకోకపోవడం వల్ల వీరంతా అడ్వాన్స్ స్టేజి నుంచి సీవియర్ స్టేజికి త్వరగా చేరుకుంటున్నారు. దీని వల్ల వారి కిడ్నీలు, కళ్లు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ” అని గాంధీ ఆసుపత్రిలోని నెఫ్రాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్, ప్రొఫెసర్ డాక్టర్ మంజూష యడ్ల తెలిపారు.