Friday, January 24, 2025

అలకనంద.. కిడ్నీ దందా

- Advertisement -
- Advertisement -

ఒక్కో కిడ్నీ మార్పిడికి రూ.50లక్షలు
వసూలు ఎనిమిది మంది
బ్రోకర్లను గుర్తించిన పోలీసులు
ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక
సమర్పించిన డాక్టర్ నాగేందర్
బృందం

8 మంది బ్రోకర్లను గుర్తించిన
పోలీసులు దర్యాప్తు
మరింత ముమ్మరం ప్రభుత్వానికి
ప్రాథమిక నివేదిక సమర్పించిన
డాక్టర్ నాగేందర్ నేతృత్వంలోని
వైద్యుల బృందం
మన తెలంగాణ/హైదరాబాద్ : సరూర్‌నగర్‌లోని అలకనంద ఆసుపత్రి వేదికగా జరిగిన కిడ్నీ రాకెట్ కేసులో కీలక మలుపు చోటు చేసుకొంది. ఈ కేసులో 8 మంది బ్రోకర్లను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. గత ఆరు నెలలుగా ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన వైద్యుడు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తమ దర్యాప్తులో వివరాలు సేకరించారు. ఈ కిడ్నీ ఆపరేషన్ కేసులో పోలీసులు తమ దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు కీలక పాత్ర పోషించారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ కేసులో ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలకనంద ఆసుపత్రి చైర్మన్ సుమంత్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని దళారులు ఈ దారుణానికి బరి తెగించినట్లు వైద్య శాఖ అధికారుల విచారణలో బహిర్గతమైంది. – ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నాగేందర్ నేతృత్వంలోని వైద్యుల బృందం దాదాపు 5 గంటలపాటు బాధితులతో మాట్లాడి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది.

కిడ్నీ రాకెట్ అంశంలో మరింత
విచారించాల్సి ఉంది : డా. నాగేంద్ర
కిడ్నీ రాకెట్ అంశంలో శస్త్రచికిత్స అలకనంద ఆస్పత్రిలోనే జరిగిందా..? అనేది మరింత విచారించాల్సి ఉందని నిపుణుల కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నాగేంద్ర తెలిపారు. ఆస్పత్రి సీజ్ చేసినందు వల్ల లోతుగా దర్యాప్తు సాధ్యం కాలేదని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులున్న వారే లక్ష్యంగా బ్రోకర్లతో కలిసి దందాకు పాల్పడుతున్నట్లు వివరించారు. పోలీసులతో సమన్వయం చేసుకుంటూ విచారించి, తుది నివేదిక ఇవ్వాల్సి ఉందని చెప్పారు. కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని చెప్పారు. కిడ్నీ ఇచ్చిన వారు తమిళనాడు చెందిన వారు అని, మాయమాటలు చెప్పి వారిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారని పేర్కొన్నారు. కిడ్నీ తీసుకునేవారు రూ.50 లక్షలు ఆసుపత్రి యాజమాన్యానికి ఇచ్చారని, కిడ్నీ డొనేట్ చేసేవారికి డబ్బులు ఇంకా ఇవ్వలేదని అన్నారు.

ప్రభుత్వానికి అందిన నివేదిక
అవయవాల మార్పిడి రాకెట్‌కు సంబంధించి అందరిని కలవరపాటుకు గురిచేసిన సరూర్‌నగర్ అలకనంద ఆసుపత్రి ఘటనలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. తమిళనాడుకు చెందిన ఇద్దరు ఒంటరి మహిళల ఆర్ధిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని దళారులు బరిగితెగించినట్లు వైద్యారోగ్య శాఖ విచారణలో వెలుగు చూసింది. డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఘటనపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో పలు కీలక అంశాలు పొందుపరిచినట్టు సమాచారం. అవయవాలు తీసుకున్న వారి నుంచి దళారులు 50 లక్షల ప్యాకేజి మాట్లాడుకున్నట్లు సమాచారం. అందులో 40 లక్షలు వైద్య ప్యాకేజి కాగా దళారులు 10 లక్షలు కమిషన్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. కిడ్నీదాతలకు 4 లక్షల చొప్పున ఇప్పిస్తామని నమ్మించి 50 వేల చొప్పున కమిషన్ చెల్లించాలని బేరం కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఆర్ధిక కారణాలతోనే తమిళనాడు నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు కిడ్నీలు విక్రయించగా, వారి కిడ్నీలను కర్ణాటక రాష్ట్రానికి చెందిన 67 ఏళ్ల వయసు గల ఒక న్యాయవాది, 48 ఏళ్ల వయసు గల ఒక సివిల్ ఇంజనీర్ సతీమణికి అమర్చినట్లు వెల్లడైంది. అయితే కిడ్నీ దాతలు, గ్రహీతలకు ఒకరితో ఒకరికి అసలు ఏ సంబంధం లేదని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News